కొబ్బరి నూనెలో యాంటీమైక్రోబయల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఈ నూనెతో ఆయిల్ పుల్లింగ్ చేస్తే నోటి దుర్వాసన తగ్గుతుంది. ఆ తరువాత గోరు వెచ్చని నీటితో నోటిని శుభ్రం చేసుకోవాలి. ప్రతి రోజు బ్రష్ చేసుకునే ముందు ఇలా చేయాలి.
రెండు లవంగాలను నోటిలో వేసుకుని నెమ్మదిగా నమలాలి. నోటి దుర్వాసన సమస్యను దూరం చేయడంలో సోంపు గింజలు కూడా ప్రభావవంతంగా పనిచేస్తాయి.
ఒక స్పూను అల్లం రసాన్ని ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కలిపి ప్రతి రోజు భోజనం తర్వాత పుక్కిలించాలి.
బేకింగ్ సోడా నోటిలోని బ్యాక్టీరియా వృద్ధిని నివారించి చెడు వాసనను దూరం చేస్తుంది. టూత్‌పేస్ట్‌లో చిటికెడు బేకింగ్ సోడా వేసి రోజుకు ఒకసారి బ్రష్ చేస్తే నోటి దుర్వాసన దూరం అవుతుంది.
గ్రీన్ టీ సహజ యాంటీ బాక్టీరియల్ సమ్మేళనాలు, ఫైటోకెమికల్స్, దుర్వాసన కలిగించే బ్యాక్టీరియాతో పోరాడుతాయి. రోజుకు మూడు కప్పుల గ్రీన్ టీ తాగవచ్చు.
కప్పు నీటిలో రెండు మూడు చుక్కల యూకలిప్టస్ నూనె వేసి ప్రతిరోజూ పుక్కిలిస్తే నోటి దుర్వాసన నుండి ఉపశమనం లభిస్తుంది.