మనసిచ్చి చూడు'సీరియల్‌లో భానుగా అద్భుత నటనతో ఆకట్టుకుంది కీర్తి భట్
నువ్వునాకు నచ్చావ్‌ సినిమాలో పింకీ పాత్రలో నటించి ఫేమస్‌ అయింది సుదీప
బిగ్‌బాస్‌ 5 కంటెస్టెంట్‌ సిరి బాయ్‌ఫ్రెండే శ్రీహాన్‌
యాంకర్‌గా కెరీర్‌ మొదలు పెట్టిన నేహా చౌదరి బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకుంది
బుల్లితెరపై తనదైన కామెడీ టైమింగుతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు చలకీ చంటీ
నటి శ్రీ సత్య.. చిన్నప్పటి నుంచ నటనపై ఉన్న ఇష్టంతో నేను శైలజ చిత్రంలో హీరో రామ్‌కి గర్ల్‌ఫ్రెండ్‌గా చిన్నపాత్రలో అలరించింది
వరుడు కావలెను, ఉప్మా తినేసింది, మిస్సమ్మ వంటి వెబ్‌ సిరీస్‌లతో గుర్తింపు పొందిన అర్జున్‌ ప్లేబ్యాక్‌, పెళ్లి కూతురి పార్టీ వంటి సినిమాల్లో నటించాడు - అర్జున్‌ కల్యాణ్‌
గీతూ రాయల్‌.. జబర్దస్త్‌ చూసేవారికి ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు
స్నేహమంటే ఇదేరా సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన నటి అభినయశ్రీ
పదో కంటెస్టెంట్స్‌గా రియల్‌ కపుల్‌ రోహిత్- మెరీనా వచ్చేశారు. మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించిన రోహిత్‌ 'నీలికలువలు','అభిలాష','కంటే కూతుర్నే కనాలి' వంటి సీరియల్స్‌తో పాపులర్‌ అయ్యాడు
ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం సినిమాతో బాలనటుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు బాలాదిత్య
సిరి సిరి మువ్వలు సీరియల్‌తో టాలీవుడ్‌కు పరిచయం అయిన వాసంతి ఆ తర్వాత సంపూర్ణేష్ బాబుతో కలిసి క్యాలీఫ్లవర్ సినిమాలో నటించింది
క్యారెక్టర్ ఆర్టిస్ట్ షానీ.. 2003లో సై సినిమాలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు
ఇనయా సుల్తాన... బుజ్జీ ఇలారా’,‘అవ్యోం జగత్‌’ సహా కొన్ని చిత్రాల్లో ఆమె నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ తన బర్త్‌డే రోజున ఆర్జీవీతో చేసిన డ్యాన్స్‌ వీడియో అప్పట్లో తెగ వైరల్‌ అయ్యింది
గరుడ వేగ, గుంటూరు టాకీస్‌ చిత్రాల్లో చిన్న పాత్రలు చేశాడు. నటుడిగా, స్క్రిప్ట్‌ రైటర్‌గా, యాంకర్‌గా కొనసాగుతున్నాడు ఆర్జే సూర్య
జబర్దస్త్‌లో తనదైన కామెడీ టైమింగుతో అలరిస్తుంది లేడీ కమెడియన్‌ ఫైమా. పటాస్‌ షోతో గుర్తింపు పొందిన ఫైమా అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపును సంపాదించుకుంది
ఫ్రెండ్‌ సలహాతో ఓసారి సరదాగా బిగ్‌బాస్‌ సీజన్‌-2పై రివ్యూ ఇస్తూ ఓ వీడియోను నెట్టింట అప్‌లోడ్‌ చేయగా ఆ వీడియో పాపులర్‌ అయ్యింది. దీంతో సొంతంగా యూట్యూబ్‌ ఛానెల్‌ ప్రారంభించి బిగ్‌బాస్‌ షోలపై తనదైన విశ్లేషణతో గుర్తింపు పొందాడు ఆది రెడ్డి
మనసు మమత సీరియల్స్‌తో పాటు మేజర్‌ సినిమాలోనూ రాజశేఖర్‌ నటించాడు
యాంకర్‌గా కెరీర్‌ మొదలు పెట్టిన ఆరోహి షార్ట్‌ ఫిల్మ్స్‌తో గుర్తింపు పొందింది. ఇస్మార్ట్‌ న్యూస్‌తో పాపులారిటీ దక్కించుకుంది
బాహుబలిలోని మనోహరీ.. పాటతో పాపులారిటీ దక్కించుకున్నాడు ప్రముఖ సింగర్‌ రేవంత్‌