సంగీతాన్ని ఉర్రూతలూగించిన సంగీత సామ్రాట్ రెహ్మాన్ పుట్టిన రోజు నేడు.. కీ బోర్డ్ ప్లేయర్‌గా కెరీర్ ప్రారంభించి, ప్రపంచ సంగీత సామ్రాజ్యంలో లెజెండ్‌గా అవతరించాడు.
HBD AR Rahman
23 సంవత్సరాల వయస్సులో దిలీప్ కుమార్ గా ఉన్న తన పేరును అల్లారఖా రెహ్మాన్గా మార్చుకున్నారు
HBD AR Rahman
నాలుగేళ్ల వయసు నుంచే తండ్రి దగ్గర పియానో నేర్చుకున్నారు రెహమాన్. చిన్నతనంలోనే తండ్రి కోల్పోయిన రెహ్మాన్ ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకొని 11 ఏళ్ల నుంచే అసిస్టెంట్‌గా పనిచేయడం మొదలుపెట్టారు.
HBD AR Rahman
రమేష్ నాయుడు, ఇళయరాజా, రాజ్-కోటి మొదలైన మ్యూజిక్ డైరెక్టర్ల వద్ద కీబోర్డ్ ప్లేయర్‌గా పనిచేస్తూ, తన టాలెంట్‌తో రాణించారు.
HBD AR Rahman
రెహమాన్ స్వరపర్చిన ఎయిర్టెల్ వాణిజ్య ప్రకటన చాలా పాపులర్ అయింది.
HBD AR Rahman
తొలి చిత్రం ‘రోజా’తోపాటు మెరుపు కలలు, లగాన్, అమృత సినిమాలకు ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డులు అందుకున్నారు.
HBD AR Rahman
రెండు దశాబ్దాలకు పైగా సాగుతున్న ఆయన కరియర్లో ఏ భారతీయ సంగీత దర్శకుడూ సాధించని ఘనతను సొంతం చేసుకున్నారు.
HBD AR Rahman
నాలుగు జాతీయ చలనచిత్ర పురస్కారాలు, పదిహేను ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు, 19 ఫిల్మ్ ఫేర్ సౌత్ పురస్కారాలు వంటి ఎన్నో అవార్డులతో పాటు రివార్డులు రెహమాన్ చెంతకు చేరాయి.
HBD AR Rahman
ఒకే ఏడాది రెండు ఆస్కార్లు అందుకున్న ఏకైక ఆసియా వ్యక్తి రెహమాన్. 2010లో కేంద్ర ప్రభుత్వం ‘పద్మభూషణ్’ పురస్కారాన్ని అందించింది.