వెంకటేశ్ సినిమాల్లో చాలామంది ప్రేక్షకులకు నచ్చిన చిత్రం ‘చంటి’.
ప్రభు, ఖుష్బూ జంట‌గా న‌టించిన చిన్నతంబి చిత్రానికి ఇది రీమేక్.
ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని ఓ చందమామ కథే ‘చంటి’.
తెలుగు, తమిళంలో హిట్ అయిన చంటి.. ఇంకా చాలా భాషల ప్రేక్షకులను మెప్పించింది.
ఇళయరాజా సంగీతం చంటికి ప్లస్ పాయింట్.
వెంకటేశ్‌లాంటి హీరో పక్కన చంటి లాంటి హిట్ సినిమాలో నటించడంతో మీనా ఒక్కసారిగా స్టార్ అయిపోయింది.
చంటి చిత్రం నాలుగు నంది అవార్డులను అందుకుంది.
అప్పటివరకు వెంకీని మాస్ హీరోగా చూసిన ప్రేక్షకులకు చంటి ఒక డిఫరెంట్ అనుభవం.
ముందుగా చంటిలో హీరోగా రాజేంద్రప్రసాద్‌ను అనుకున్నాడు దర్శకుడు రవిరాజా పినిశెట్టి.
చంటిలో వెంకటేశ్ హీరోగా నటించడానికి నిర్మాత రామనాయుడే కారణం.
చంటి విడుదలయ్యి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా హీరోయిన్ మీనా ఓ స్పెషల్ పోస్ట్ పెట్టింది.