Hitler Movie 25 years
జనవరి 4, 1996న విడుదలైన హిట్లర్ సినిమా నేటితో 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
ఈ సినిమా సిల్వర్ జూబ్లీ సందర్భంగా నిర్మాత ఎడిటర్ మోహన్ తనయుడు మోహన్ రాజా తాజాగా సోషల్ మీడియాలో ఓ ఫోటో షేర్ చేశారు.
మలయాళం సూపర్ హిట్ సినిమాకి ఇది రిమేక్.. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించిన హిట్లర్ మెగాస్టార్ కెరీర్లో పెద్ద మలుపు.
1994 మెగాస్టార్ కెరీర్ బిగ్ డిజాస్టర్.. 96లో వచ్చిన హిట్లర్ ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ సినిమా ఓ సంచలనాన్ని సృష్టించింది.
చిరంజీవి తండ్రి పాత్రలో దాసరి, ప్రేయసి పాత్రలో రంభ గ్లామర్‌తో పాటు రాజేంద్రప్రసాద్, సుధాకర్ కామెడీ కూడా సినిమాకు ప్లస్ పాయింట్స్ అయ్యాయి.
ఓ ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇవివి దర్శకత్వంలో మోహన్ బాబు హీరోగా హిట్లర్‌ను తెరకెక్కించాలనుకున్నారట.
మోహన్ రాజా అప్పట్లో హిట్లర్ సినిమాకి సహాయ దర్శకుడు. అతను ఇప్పుడు చిరంజీవితో ది గాడ్‌ఫాదర్ సినిమాని తెరకెక్కిస్తున్నాడు.