ఎదిగే పిల్లలకు పాలు పట్టకపోతే ఎలా.. రెండు పూటలా పాలు తాగాలి.. క్యాల్షియం, విటమిన్ డితో సహా పిల్లలకు అవసరమైన పోషకాలు పాలలో ఉంటాయని అంటారు.
పాలలోని కొవ్వు చిన్న పిల్లలకు ముఖ్యమైన కేలరీలను అందిస్తుంది. ఇన్ఫెక్షన్లతో పోరాడడానికి పాలు సహాయపడతాయి.
కొంత మంది చిన్నారులకు పాలు ఇష్టం ఉండదు.. అలాంటి చిన్నారులకు డ్రైప్రూట్స్, ఆకు కూరలు కాల్షియం ఉన్న గింజ ధాన్యాలు ఇవ్వాలి.
మాంసం, చేపలు, గుడ్లు, గింజలు, చిక్కుళ్లు వంటి వాటిలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది.
శాకాహారం తీసుకునే పిల్లలు విటమిన్ B12 మరియు అయోడిన్ వంటి పోషకాలను తగినంతగా తీసుకునేలా చూసుకోవడానికి సప్లిమెంట్ అవసరం కావచ్చు.
ఆరోగ్య శాఖ ఐదేళ్ళలోపు చిన్నారులకు విటమిన్ సప్లిమెంట్స్ తీసుకోవాలని సిఫార్సు చేస్తుంది.
కొందరు చిన్నారులకు పాలు మాత్రమే ఇష్టం.. మరే ఆహారాలు తినడానికి ఇష్టపడరు. దీంతో వారి ఆహారంలో ఇతర కీలక పోషకాలు, ఫైబర్ తక్కువగా ఉండవచ్చు.
ఆహారంలో ఫైబర్ తక్కువైతే మలబద్ధకానికి దారి తీస్తుంది. పిల్లలు అధిక మొత్తంలో పాలను తీసుకుంటే, ఇనుము లోపంతో అనీమియాకు గురయ్యే ప్రమాదం ఉంటుంది.
పాలు అత్యంత పోషకమైన ఆహారం.. అధికంగా తీసుకుంటే బరువు పెరగడానికి దారితీయవచ్చు.