గోరింటాకునకు ఒంట్లోని వేడిని తగ్గించే ఔషద గుణం కలిగి ఉంది. అంతేకాకుండా గోరింటాకు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
ఆధ్యాత్మిక పరంగా గోరింటాకు సౌభాగ్యానికి ప్రతీక. మహిళలు గోరింటాకు పెట్టుకోవడం ద్వారా సౌభాగ్యాన్ని పొందిన వారవుతారని చెబుతారు
మహిళలు ఎక్కువగా డిటర్జెంట్స్, సర్ఫులను వాడుతారు. ఈ సమయంలో వారి గోళ్లలో నీరు చేరి సమమస్యలు వస్తాయి. గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఆ సమస్యలన్నీ దూరం అవుతాయి
అరచేతుల్లో సూర్యుని ఆకారాన్ని పోలి ఉండే గుండ్రటి డిజైన్ వేసేవారు. జ్ఝాన కాంతిని గోరింట ద్వారా మేలుకొలపడంగా భావించేవారు.
ఈజిఫ్ట్ ‘మమ్మీల' జుట్టు, గోళ్లు ముదురు గోధుమ రంగులోకి రావడానికి గోరింటాకు వాడేవారని వార్త ఉంది. క్రీ. పూ 700 కాలంలో గోరింట మొక్క ఈజిఫ్ట్ నుంచి దేశంలో అడుగుపెట్టిందని చెబుతున్నారు.
గోరింట చెట్లు ఇంట్లో ఉంటే ఆత్మలు దరిచేరవని, మంచి భావాలను కలిగిస్తుందిని నమ్మేవారు. గోరింట ఆకులను ఎండబెట్టి, పొడి చేసి చేతులు, పాదాలపై రేఖాగణిత నమూనాలలో డిజైన్లు వేసుకొనేవారు.