అవును మరి.. అదే పనిగా కప్పులు మీద కప్పులు తాగితే లావైపోతారు.. అందులో ఏముంది ఉత్త నీళ్లే కదా అనుకుంటే పొరపాటే..
పంచదార, పాలు.. ఇవి కదా కేలరీలను పెంచేసాధనాలు.. ఒక మనిషికి రోజుకు దాదాపు 2,500 కేలరీలు అవసరమవుతాయి
ఒక కప్పు చక్కని, చిక్కని టీలో దాదాపు 200 కేలరీలు ఉంటాయి.. మేం తాగే చాయ్‌లో అన్ని కేలరీలు ఉండవనుకుంటే మరెందుకు తాగడం..
అతిగా టీ తాగేతే ఆరోగ్యానికి చేటు.. కడుపులో మంట, గ్యాస్ ట్రబుల్.. అవసరమా!! తక్కువ సమయంలో ఎక్కువ టీలు తాగితే బీపీతో పాటు హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి..
ఓ మంచి మసాలా టీ తాగితే మీ మెటబాలిజం కూడా పెరుగుతుంది.. అల్లం, దాల్చిన చెక్క, తులసి ఆకులతో తయారు చేసిన టీ ఆరోగ్యానికి మంచిది..
ఇక చెక్కర బదులు బెల్లం వాడితే శరీరానికి కావలసిన ఐరన్ కూడా అందుతుంది.. చక్కెర బరువు పెంచడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది..
టీలో వాడే మసాలా దినుసులు కొవ్వు కరిగించడంలో సహాయపడతాయి. ఫైనల్లీ.. టీలో ఉండే కెఫిన్ ఎనర్జీని బూస్ట్ చేసింది..
మీ ఫైన్ మార్నింగ్ ఓ మాంఛి మసాలా ఛాయ్‌తో మొదలయ్యేలా చూసుకోండి.. ఆరోగ్యంగా ఉండండి.. కానీ టీ తాగడానికి ముందే ఎట్‌లీస్ట్ హాఫ్ లీటర్ వాటర్ తాగడం అలవాటు చేసుకోండి..