క్యాప్సికమ్‌లో విటమిన్ ఎ, విటమిన్ బి6, విటమిన్ సి, విటమిన్ కె పుష్కలంగా ఉంటాయి. ఇందులో యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
టొమాటోల్లో విటమిన్ సి, కార్టినాయిడ్స్, లైకోపిన్ ఉంటాయి. ఇవి చర్మాన్ని ఎండనుంచి ముడతలు పడకుండా చేస్తాయి
గ్రీన్‌టీలో కేట్చిన్స్ ఉంటాయి. ఇందులో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని సురక్షితంగా ఆరోగ్యంగా ఉంచుతాయి
పొద్దుతిరుగుడు విత్తనాల్లో ఉండే న్యూట్రియంట్లుు, విటమిన్ ఇ చర్మానికి యాంటీఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి
స్ట్రాబెర్రీల్లో కూడా విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి
డార్క్ చాక్లెట్‌లో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. చర్మం ముడతలు పడకుండా, పగలకుండా చేస్తుంది
బ్రకోలిలో ఉండే కార్టినాయిడ్స్, విటమిన్లు, మినరల్స్.. స్కిన్ క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటుంది
వాల్‌నట్స్‌లో ఉండే విటమిన్ ఇ, జింక్, సెలినియమ్, ప్రొటీన్ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది