తొలితరం మహిళా ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్.
ఫాతిమా షేక్ 191వ జయంతి ఈరోజు.
లింగ, కుల అసమానతలపై ఫాతిమా పోరాడారు.
ఫాతిమా సేవలకు ఉర్దూ పాఠ్య పుస్తకాల్లో ఆమె గురించి పాఠాలను చేర్చింది.
ఫాతిమా సావిత్రీబాయి స్నేహితురాలు, సహోద్యోగి.
సోదరుడు ఉస్మాన్ షేక్ ప్రోత్సాహంతో ఉన్నత చదువులూ అభ్యసించారు ఫాతిమా.
దుమ్మెత్తి పోసినా, పేడ నీళ్ళు కుమ్మరించినా, రాళ్ళు విసిరినా చలించలేదు.
దేవుని దృష్టిలో అందరూ సమానమే అయినప్పుడు మానవుల మధ్యనే ఈ వివక్ష ఎందుకన్నది ఆమె ప్రశ్న.
ఎంతో సేవ చేసినప్పటికీ.. గుర్తింపుకు నోచుకోని మహిళల్లో ఫాతిమా షేక్ కూడా ఒకరు.
కొందరు ఫాతిమాను ఉస్మాన్ షేక్ సోదరిగా చెబుతుంటారు.