ఇండియాలో కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి స్పుత్నిక్ వి రూపంలో మరో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది.
Sputnik vaccine
లాన్సెట్‌లో ప్రచురించిన డేటా ప్రకారం 60 ఏళ్లు పైబడిన వాళ్లలో స్పుత్నిక్ వి సామర్థ్యం 91.8 శాతం. మధ్యస్థ స్థాయి నుంచి తీవ్ర స్థాయి కొవిడ్-19 విషయంలో 100 శాతం సమర్థంగా పని చేస్తున్నట్లు తేలింది.
Sputnik vaccine
ఈ వ్యాక్సిన్‌ను రెండు విధాలుగా స్టోర్ చేయవచ్చు. ద్రవ రూపంలో అయితే -18 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత అవసరం. పొడి రూపంలో అయితే 2-8 డిగ్రీల సెంటిగ్రేడ్ సరిపోతుంది.
Sputnik vaccine
ప్రస్తుతం ఇండియాలో ఇస్తున్న రెండు వ్యాక్సిన్ల ధర కూడా డోసుకు రూ.250 మాత్రమే. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అయితే ఫ్రీగా ఇస్తున్నారు. స్పుత్నిక్ వి ధర ఇండియాలో ఎంత అన్నది మాత్రం ఇంకా తెలియలేదు.
Sputnik vaccine
మిగతా రెండు వ్యాక్సిన్లలాగే స్పుత్నిక్ వి కూడా రెండు డోసులు ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కో డోసు 0.5 మిల్లీలీటర్లు. అయితే తొలి, మలి విడత డోసులకు కాస్త వేరుగా ఉండే వెర్షన్లను ఉపయోగించడం స్పుత్నిక్ వి ప్రత్యేకత.
Sputnik vaccine
తొలి డోసు (rAd26) ఓ వెక్టార్ కాగా.. రెండో డోసు (rAd5) మరో వెక్టార్. రెండు వేర్వేరు వెక్టార్లను వాడినా ఇవి రెండూ వైరస్ స్పైక్ ప్రొటీన్‌పై దాడి చేస్తాయి. ఒకటి, రెండు డోసులను 21 రోజుల వ్యవధిలో ఇస్తారు.
Sputnik vaccine
జలుపు, తలనొప్పిలాంటి సైడ్ ఎఫెక్ట్స్ మాత్రమే కనిపించినట్లు డేటా చెబుతోంది. వ్యాక్సిన్ తీసుకున్న చెయ్యి నొప్పిగా ఉండటం, అలసిపోయినట్లు ఉండటం, కాస్త ఉష్ణోగ్రత పెరగడంలాంటి స్వల్ప లక్షణాలే కనిపించినట్లు తేలింది.
Sputnik vaccine
ఇప్పటి వరకూ ఈ వ్యాక్సిన్ తాలూకు మరణాలు ఏవీ సంభవించలేదు. ఇప్పటికే ఈ వ్యాక్సిన్‌ను 59 దేశాలు వినియోగిస్తున్నాయి.