కష్టపడి సంపాదించిన సొమ్ము అత్యవసర సమయాల్లో ఆదుకుంటుందని బ్యాంకుల్లో దాచుకుంటారు చాలా మంది.. అది రికరింగ్ డిపాజిట్ల రూపంలో కావచ్చు లేదా ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో కావచ్చు..
2. ఫిక్స్డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లలో ఒకదానికి ఎంచుకోవాలంటే.. ముందు రెండూ అందిస్తున్న ప్రయోజనాల గురించి తెలుసుకోవాలి.
3. ఫిక్స్డ్ డిపాజిట్లలో 7 రోజుల నుంచి 10 సంవత్సరాల కాల వ్యవధి వరకు డబ్బును పెట్టుబడిగా పెట్టవచ్చు. అత్యవసర సమయాల్లో 90 శాతం వరకు రుణం తీసుకునే సదుపాయం కూడా ఉంది.
4. ఫిక్స్డ్ డిపాజిట్లపై సంపాదించిన వడ్డీపై స్లాబ్ ఆధారంగా పన్ను వర్తిస్తుంది. ఒకవేళ డిపాజిట్లపై వచ్చిన వడ్డీ మొత్తం 10వేలు మించితే ఏడాదికి 10 శాతం చొప్పున బ్యాంకు టీడీఎస్ కింద డిడక్ట్ చేస్తుంది.
5. ప్రతినెలా కొంత మొత్తాన్ని రికరింగ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టడం మంచిది. కచ్చితమైన రాబడిని అందిస్తుంది.. వడ్డీ రేటు స్థిరంగా ఉంటుంది.
6. పెద్ద మొత్తంలో నగదు ఉంటే ఫిక్స్డ్ డిపాజట్లలో పెట్టుబడి పెట్టవచ్చు.
7. జీతం నుంచి పెట్టుబడి పెట్టాల్సివస్తే రికరింగ్ డిపాజట్లు బెస్ట్ ఆప్షన్.
8. వడ్డీ రేటు విషయానికి వస్తే ఫిక్స్డ్ డిపాజిట్లకు ఎక్కువగా వస్తుంది. ఇందులో ఒకేసారి పెద్దమొత్తంలో పెట్టుబడి పెట్టడమే దీనికి కారణం.