9. మానసిక క్షీణతను నివారించడంలో విటమిన్ సి కీలకమైన అంశం కాబట్టి మెదడు ఆరోగ్యానికి రోజుకి ఒక మీడియం సైజ్ ఆరెంజ్ తీసుకోవడం అవసరం. విటమిన్ సి మెదడు ఆరోగ్యానికి తోడ్పడుతుంది. డిప్రెసివ్ డిజార్డర్, యాంగ్జయిటీ, స్కిజోఫ్రెనియా, అల్జీమర్స్ వ్యాధి వంటి వాటినుంచి రక్షించవచ్చు. బెల్ పెప్పర్స్, జామ, కివి, టమోటాలు, స్ట్రాబెర్రీ వంటి ఇతర ఆహారాల నుండి కూడా అధిక మొత్తంలో విటమిన్ సి పొందవచ్చు.