అయిదడుగుల పది అంగుళాల అందంతో అందర్నీ కట్టిపడేసింది ఈ జాతిరత్నం హీరోయిన్.
తన బ్యూటీ సీక్రెట్ బేబీ ఆయిల్‌తో మసాజ్ చేసుకోవడమే అంటోంది..
నిగనిగలాడే తన కర్లీ హెయిర్‌కి వారానికి కనీసం రెండు మూడు సార్లు గోరు వెచ్చని కొబ్బరి నూనెతో మసాజ్ చేస్తుంది.
శాఖాహార భోజనం.. ఆహారంలో ఆకు కూరలు, పండ్లు ఎక్కువగా తీసుకుంటుంది.
నీళ్లు ఎక్కువగా తాగుతూ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకుంటుంది.
గ్లామరస్‌గా ఉండాలంటే మేకప్ కాదు.. ఆత్మవిశ్వాసం అవసరం అంటుంది.
హైదరాబాద్‌లోని లయోలా కాలేజీలో మాస్ కమ్యూనికేషన్ చదువుతున్నప్పుడు, ఒక ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన నాగ్ అశ్విన్‌ ఆమెను చూసి జాతి రత్నాల్లో అవకాశం ఇచ్చారు.
ఫరియా హైదరాబాదీ అమ్మాయి అయినా కువైట్‌లో జన్మించిన చిట్టి ఈమె.