Hair Loss
పోషకాహారం లోపం వల్ల కూడా జుట్టు రాలిపోతుంది.ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. అలాగే కంటినిండా కునుకు, తగినంత వ్యాయామం చేయడం కూడా అవసరమే.
మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండాలి
బయటకు వెళ్లినప్పుడు, పొల్యూషన్లో తిరిగినప్పుడు తలను స్కార్ఫ్ లేదా క్యాప్ సాయంతో కవర్ చేసుకోవాలి.
రెగ్యులర్గా షాంపూతో తలను శుభ్రం చేసుకోవాలి. మగవారు అయితే రోజు విడిచి రోజు, మహిళలు అయితే వారానికి రెండు లేదా మూడు సార్లు తలస్నానం చేయాలి.
తల మరీ జిడ్డుగా ఉన్నప్పుడు తప్ప ఎక్కువ రసాయనాలు ఉండే షాంపులు, కండీషనర్లను వినియోగించవద్దు. ఆయిలీ ఫ్రీ, మైల్డ్ షాంపూలను వాడాలి.
హెయిర్ స్టైలిషింగ్ కోసం చాలామంది హెయిర్ డ్రయ్యర్లు, కర్లర్స్ వాడుతుంటారు. అయితే వీటిని ఎక్కువగా వినియోగిస్తే జుట్టు చిట్లిపోతుంది. గడ్డిలా మారి రాలిపోతుంది.
ఉల్లి, వెల్లుల్లి, అల్లం రసాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. శిరోజాల సంరక్షణలోనూ ఇవి దోహదపడతాయి. వీటిలో ఏదో ఒక రసాన్ని నిద్రపోయేముందు నెత్తికి పట్టించి.. పొద్దున్నే తలస్నానం చేస్తుండాలి.