గాడిద పాలు మానవ రొమ్ము పాలు, ఆవు పాలతో సమానమైన ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలను కలిగి ఉంటాయట.
వీటిలో కొవ్వు తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇవి తాగడం వల్ల శరీరానికి కేలరీలు, విటమిన్- డి ఎక్కువగా అందుతాయి. ఇవి లాక్టోస్ రూపంలో ఉంటాయి.
ఆర్థరైటిస్, దగ్గు జలుబు లాంటి ఇన్ఫెక్షన్లను నయం చేయడంతో పాటు గాయాలకు చికిత్స చేసేందుకు గాడిద పాలు ఉపయోగిస్తారు.
దీంట్లోని యాంటీ-మెక్రోబయాల్ లక్షణాలు అంటువ్యాధులు, బ్యాక్టీరియా, ఇతర వైరస్ల నుంచి దూరం చేసేందుకు సహాయపడతాయి.
ఆవు పాలతో పోలిస్తే.. గాడిద పాలలో ఐదు రెట్లు తక్కువ కెసిన్, సమానస్థాయిలో ప్రొటీన్లు కలిగి ఉంటాయి. అందుకనే వీటిని తాగడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి.
గాడిద పాలలో మరొక ముఖ్యమైన భాగం లాక్టోస్. ఇది మీ శరీరం కాల్షియం గ్రహించడానికి సహాయపడి, ఎముక‌ల‌ను బ‌లంగా మారుస్తుంది.
గాడిద పాలతో స్నానం చేయడం వల్ల మెత్తని, మృదువైన చర్మం మీ సొంతం చేసుకోవచ్చు.
గాడిద పాలు సౌందర్య ఉత్పత్తులైన స్కిన్ క్రీములు, ఫేస్ మాస్క్‌లు, సబ్బులు మరియు షాంపూల తయారీలో వాడతారు.