అసలే వర్షాకాలం.. ఆపై ఇంట్లో ఈగలు.. ఎక్కడ వాలితే ఏ జ్వరాలు వస్తాయో అని ఎంతో కంగారు.. కీటకాలను దూరంగా ఉంచేందుకు సాధారణ సహజపద్దతులు.. వాటి గురించి వివరంగా..
ఈగలు ఎక్కువగా చెత్త డబ్బాలు, కుళ్ళిన మాంసం, ఇతర ఆహారం మరియు మలం చుట్టూ తిరుగుతాయి కాబట్టి అవి మీ ఇంటికి సూక్ష్మక్రిములను సులభంగా ట్రాన్స్మిటర్లుగా మారుస్తాయి.
కొంచెం కర్పూరాన్ని తీసుకుని దాన్ని వెలిగించాలి. ఆ పొగకు ఈగలు పారిపోతాయి. ఇంట్లోని మూలల్లో కర్పూరం ఉంచాలి. దాని వాసనకు కూడా ఈగలు రాకుండా ఉంటాయి.
యాపిల్ సైడర్ వెనిగర్ ఈగలను తరిమికొడుతుంది, స్ప్రే బాటిల్‌ని తీసుకొని అందులో ఈ వెనిగర్ వేసి దానికి కొద్దిగా నీరు కలిపి ఇంటి చుట్టూ పిచికారీ చేయవచ్చు.
తులసి మొక్క ఈగలను దూరంగా ఉంచుతుంది. మీరు ఇంట్లో తులసి మొక్కలను ఉంచవచ్చు లేదా ఇంటి చుట్టూ తులసి ఆకులను ఉంచవచ్చు.
బే ఆకు లేదా బిర్యానీ ఆకు. ఈ ఆకును కాల్చి ఆ పొగ ఇల్లు మొత్తం వ్యాపించేలా చేయవచ్చు. ఈ ఆకులు అక్కడక్కడా ఇంట్లో ఉంచడం ద్వారా కూడా ఇంట్లోకి ఈగలు రావు.
యూకలిప్టస్ ఆయిల్‌ని ఇంట్లోని కర్టెన్స్ మీద, బెడ్ షీట్స్ మీద స్ప్రే చేయాలి. ఈ వాసనకు ఈగలు పరార్.
పుదీనా ఈగలను తరిమికొడుతుంది. పుదీనా మొక్కలను కిటికీల దగ్గర, బాల్కనీలో ఎక్కువగా ఉంచండి.
ఈగలను చంపడానికి ఫ్లై జాపర్‌ని ఉపయోగించడం సులభమైన మరియు అత్యంత ప్రభావవంతమైన మార్గం.