రోజు 4 లీటర్ల నీరును తాగడం కొంత కష్టమే కాబట్టి కూరగాయలను ఆహారంలో ఎక్కువగా తీసుకునే ప్రయత్నం చేయండి. కూరగాయల్లో నీరు పుష్కలంగా ఉంటుంది.
మీ బిజీ షెడ్యూల్‌లో కూడా తగినన్ని నీరును తాగాలంటే.. మీ ఫోన్‌లో రిమైండర్‌ను సెట్ చేసుకోండి.
కూల్‌డ్రింక్స్‌కు పెట్టే ఖర్చును కొబ్బరినీళ్లు తాగడానికి ఉపయోగిస్తే శరీరానికి ఆరోగ్యానికి చాలా మంచిది. అనేక పోషకాలు కొబ్బరి నీళ్లలో ఉంటాయి.
ఓ మంచి హెల్త్ ట్రాకర్ యాప్‌ను మీ మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకోండి. ఈ ట్రాకర్ ద్వారా మీరు ఎంత నీరు తీసుకుంటున్నారో స్పష్టత వస్తుంది.
మీరు బయటకి వెళ్లినప్పుడు ఓ వాటర్ బాటిల్‌ను తీసుకువెళ్లండి. ఈ ఒక్క చిన్న అలవాటు మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
బత్తాయి, పుచ్చకాయ, యాపిల్.. వీటిలో ఏదైనా ఒక పండును ప్రతీ రోజు తినడం వల్ల శరీరంలో కలిగే మార్పులను మీరు వారంలో చూస్తారు.
ఉదయం నిద్రలోంచి లేవగానే గొరువెచ్చగా ఉన్న ఒక లీటర్ నీరును 5 లేదా 10 నిమిషాల్లో తాగండి
పడుకునే ముందు రెండు గ్లాసుల నీరును తాగితే జీర్ణవ్యవస్థకు బాగా సహకరిస్తుంది