watermelon juice
నీటి శాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయ రోగ నిరధక శక్తిని పెంచుతుంది. ఇన్ఫెక్షన్ల బారిన పడినప్పుడు కలిగే కండరాల నొప్పిని తగ్గిస్తుంది. పుచ్చకాయలోని గింజలు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
టమాటాల్లో విటమిన్ సీ, ఈ, బీటా కెరోటిన్ పుష్కలంగా లభిస్తుంది. ఈ పోషకాలు రోగ నిరోధక శక్తిని తగ్గించే ఫ్రీ రాడికల్స్‌ను అడ్డుకుంటాయి.
నిమ్మ, నారింజ, ద్రాక్ష వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో విటమిన్ సీ సమర్థవంతంగా పనిచేస్తుంది. సిట్రస్ పండ్ల జ్యూస్‌లు తాగడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.
బీట్రూట్లో విటమిన్ సీ, ఈ ఎక్కువగా ఉంటుంది. అలాగే కాల్షియం, ఐరన్ కూడా పుష్కలంగా లభిస్తుంది. బీట్రూట్లో లభించే లైకోపిన్, ఆంథోసైయనిన్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
క్యారెట్లలో విటమిన్ ఏ, బీ1, బీ2, బీ3, నియాసిన్, ఫోలెట్, కాల్షియం, పొటాషియం, మెగ్నిషియం వంటి పోషకాలతో పాటు పీచు పుష్కలంగా ఉంటుంది.
యాపిల్‌లో విటమిన్ ఏ, బీ1 బీ2, బీ6, సీ విటమిన్లతో పాటు ఫోలిక్ యాసిడ్, నియాసిన్, జింక్, పొటాషియం వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఇవి ఇమ్యూనిటీని పెంచడంతో పాటు నరాల వ్యవస్థను బలోపేతం చేస్తాయి.