టాటా సన్స్ గ్రూప్‌లో సింగిల్ లార్జెస్ట్ షేర్ హోల్డర్‌గా.. అత్యధికంగా 18.5 శాతం వాటా కలిగి ఉన్నారు సైరస్ మిస్ట్రీ.
2012లో రతన్ టాటా రిటైర్మెంట్ ప్రకటించిన తరువాత టాటా సన్స్‌కు ఆరవ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు
26 ఏళ్ల వయసులోనే తండ్రికి చెందిన షాపూర్జీ పల్లోన్జీ కన్స్‌ట్రాక్షన్ గ్రూపు కంపెనీకి ఎండీగా బాధ్యతలు చేపట్టారు
లండన్‌లోని ఇంపీరియన్ కాలేజ్ నుంచి సివిల్ ఇంజనీరింగ్‌ను పూర్తి చేశారు. 1997లో లండన్ బిజినెస్ స్కూల్‌ నుంచి మ్యానేజ్మెంట్‌లో ఎమ్మెస్సీ కంప్లీట్ చేశారు.
మిస్త్రీ సొంత కంపెనీ అయిన షాపూర్జీ పల్లోన్జీ గ్రూపు సంస్థలను అందనంత ఎత్తుకు తీసుకెళ్లి డెవలప్ చేశారు
2016 అక్టోబర్‌ను టాటా గ్రూప్ చైర్మన్ బాధ్యతల నుంచి తప్పుకొని కోర్టుల్లో దాని పై సుదీర్ఘంగా పోరాడారు.
సైరస్‌కు ఇద్దరు సోదరీమణులు, లైలా, అలూ.. రతన్ టాటా సోదరుడు నెయెల్ టాటా అలూను వివాహమాడారు.
మిస్త్రీ చాలా మృదు స్వభావి, అందరితో కలిసిపోయే తత్వం.. కార్లు.. అందుటో ఎస్‌యూవీలంటే విపరీతమైన ఇష్టం
హార్స్ రైడింగ్ అంటే మిస్త్రీకి అమితమైన ప్రేమ.. పూణెలోని తన సొంత 200 ఎకరాల పొలంలో హార్స్ రైడింగ్ చేసేవారు
ఆటోమొబైల్ దిగ్గజానికి చైర్మన్‌గా పనిచేసినా.. హై స్పీడ్లో సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల మరణించడం ఓ యాదృచ్ఛికం