KGF అనే ఒక్క సినిమాతో కన్నడ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా నేషనల్ స్టార్ అయిపోయాడు యశ్.. నేడు ఈ హీరో 36వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు.
యశ్ అసలు పేరు నవీన్ కుమార్ గౌడ. జనవరి 8, 1986 న కర్ణాటకలోని హసన్ జిల్లాలోని జన్మించాడు. ఆయన తండ్రి బస్సు డ్రైవర్‌గా పనిచేస్తుండేవాడు.
సినిమాలంటే చిన్నప్పటి నుంచి ఇష్టం ఉండడంతో మూడు వందల రూపాయలతో బెంగళూరు వచ్చాడట యశ్. బంధువులు ఇంటికి వెళ్లలేక కెంపెగౌడ బస్టాండ్‌లో చాలా రాత్రులు గడిపాడట.
ఆ తర్వాత చాలా కష్టపడి సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేశాడు. 2008 లో తన భార్య రాధిక పండిట్ సరసన మోగ్గినా మనసు చిత్రంతో కన్నడ సినీ రంగ ప్రవేశం చేశాడు.
2016 లో తన మొదటి సినిమా హీరోయిన్ రాధిక పండిట్‌ను పెళ్లిచేసుకోగా, వీరికి ఇద్దరు సంతానం..
కేజీఎఫ్ మూవీతో తిరుగులేని హీరోగా అవతరించాడు యశ్.. ఈ సినిమా ఏకంగా రూ .200 కోట్ల వసూళ్లు చేసింది.
కేజీఎఫ్ బ్లాక్ బస్టర్ తర్వాత యష్ ప్రతి ప్రాజెక్టుకు రూ .15 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు చెబుతున్నారు.
తను ఏ బస్టాండ్‌లో అయితే ఆకలితో నిద్రలేని రాత్రులు గడిపాడో.. అదే బాస్టాండ్(కెంపెగౌడ బస్టాండ్)లో యశ్‌కు 216 అడుగుల కటౌట్ ఏర్పాటు చేశారు అభిమానులు.
త్వరలోనే KGF2తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు యశ్.. ఏప్రిల్ 14న ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. తాజాగా “కాజన్, డేంజర్ ఎహెడ్” అనే పేరుతో ఓ పోస్టర్ రిలీజ్ చేశారు.