ఏసుదాసు పాడే జోల హరివరాసనంతోనే అయ్యప్ప స్వామికి నిత్యం పవళింపు సేవ చేస్తారు.
సుమారు 80వేలకు పైగా పాటలను పాడారు ఏసుదాసు.
పదిహేడేళ్ళ వయసులో కర్ణాటక గాత్ర సంగీతంలో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచారు.
ఏసుదాసు పాటలలో మొదటి ప్రసిద్ధ పాట "జాతి భేదం మత ద్వేషం".
అంతులేని కథ, మేఘ సందేశం, స్వయంవరం వంటి సినిమాల్లో ఏసుదాసు పాడిన పాటలే స్పెషల్.
అసెంబ్లీ రౌడీలో ‘అందమైన వెన్నెలలోనా’ వంటి డ్యూయట్స్ కూడా ఏసుదాసు ఖాతాలో ఉన్నాయి.
‘దళపతి’లో పాడిన సింగారాల పైరుల్లోనా పాట ఎప్పటికీ ఎవర్ గ్రీన్.
నటుడిగా కూడా పలు సినిమాల్లో కనిపించి మెప్పించారు ఏసుదాసు.
ఎస్‌పీ బాలు, ఏసుదాసు పోటాపోటీగా పడిన పాటలు ఇప్పటికీ చాలామందికి ఫేవరెట్.
గాన గాంధర్వుడు ఏసుదాసుకు పుట్టినరోజు శుభాకాంక్షలు.