పుట్టి పెరిగింది సెప్టెంబరు 28, 1929న ఇండోర్ (మధ్యప్రదేశ్)లో సంగీత అభిరుచి గల కుటుంబంలో పెద్ద బిడ్డగా జన్మించారు -- తండ్రి దీనానాథ్, లతాజీ, మీనా, ఆశా, ఉష, ఏకైక సోదరుడు హృదయనాథ్ ఉన్నారు. ఐదు సంవత్సరాల వయస్సు నుండి ఆమె సంగీత రంగస్థల నాటకాలలో నటించారు.
కార్ల ప్రేమికురాలు ఆమెకు కార్లంటే మక్కువ. ఆమె గ్యారేజ్‌లో లేటెస్ట్ కార్లు ఉండేవి. హిల్‌మ్యాన్, చేవ్రొలెట్, క్రిస్లర్, మెర్సిడెస్‌లు ఉన్నాయి.
అరుదైన గౌరవం 'ది నైటింగేల్ ఆఫ్ ఇండియా' 'స్వర్ణకోకిల' అని పిలువబడే లతా మంగేష్కర్ 1974లో రెన్ ఆర్కెస్ట్రాతో కలిసి లండన్‌లోని ప్రసిద్ధ రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో ప్రదర్శన ఇచ్చిన మొదటి భారతీయ కళాకారిణి
ఫోటోగ్రఫీ అంటే ఆసక్తి ఫోటోగ్రఫీ అంటే లతాజీకి చాలా ఇష్టం. లతా మంగేష్కర్ మొదట్లో రోలీఫ్లెక్స్ కెమెరాతో ఫోటోలను తీయడానికి ప్రయత్నించారు. ఎక్కువగా USలో సెలవులో ఉన్నప్పుడు క్లిక్ చేయడానికి ఇష్టపడేవారు.
అభిరుచులు భోజనప్రియురాలు, లతా మంగేష్కర్ తన ఒత్తిడిని వంట చేయడం, క్రికెట్ మ్యాచ్‌లు చూడటం ద్వారా అధిగమించేవారు. ఎక్కువగా టెస్ట్ సిరీస్‌లు చూసేవారు. డాన్ బ్రాడ్‌మాన్, సచిన్ టెండూల్కర్‌ల ఆటోగ్రాఫ్ తీసుకున్నందుకు చాలా గర్వంగా ఫీలయ్యేవారు.
ఇష్టమైన అమెరికన్ గాయకులు లతా మంగేష్కర్ మొజార్ట్, బీథోవెన్, చోపిన్, నాట్ కింగ్ కోల్, ది బీటిల్స్, బార్బ్రా స్ట్రీసాండ్, హ్యారీ బెలాఫోంటేలను వింటూ ఆనందించేవారు.
ఇష్టమైన థియేటర్ ఆమె వేదికపై మార్లిన్ డైట్రిచ్ పాడడాన్ని చూసి చాలా సంతోషించారు. ఇంగ్రిడ్ బెర్గ్‌మాన్ థియేటర్‌ అంటే ఆమెకు చాలా ఇష్టం.
ఇష్టమైన హాలీవుడ్ చిత్రాలు ఆమెకు ఇష్టమైన హాలీవుడ్ చిత్రాలు ది కింగ్ అండ్ ఐ. ఆ చిత్రాన్ని కనీసం 15 సార్లు చూశానని చెప్పేవారు.
పెట్స్ ప్రేమికురాలు లతా మంగేష్కర్ పెంపుడు జంతువులను ప్రేమించేవారు. ఇంట్లో ఆమెకు తొమ్మిది కుక్కలు ఉన్నాయి.
రివార్డులు, సన్మానాలు ఏడు దశాబ్ధాలుగా సినీ గీతాలను పాడి సంగీత ప్రియులను అలరించారు. అనేక అవార్డులు ఇచ్చి ఆమెను గౌరవించుకుంది దేశం. మూడు సార్లు పద్మ అవార్డులు, ఐదు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు -- 2001లో భారతరత్న ఆమెను అలంకరించాయి.
ఆమె వారసత్వం ఆమె లేదు కానీ ఆమె పాట ఉంది. ఆమె పాటకు పరవశించని హృదయం ఉండదు.