బాలీవుడ్‌లో చాలామంది హీరోయిన్స్ సినిమాల్లో మెరవకపోయినా ఫిట్‌గా ఉండే ప్రయత్నాన్ని మాత్రం ఆపరు.
మలైకా అరోరా కూడా 48 ఏళ్లు వచ్చినా ఇంకా ఫిట్‌గా ఉంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
కనిపించడానికి అందంగా మాత్రమే కాదు.. ఫిట్‌గా ఉండడానికి కూడా ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటుంది.
మలైకా అలా ఫిట్‌గా ఉండడానికి యోగా అలవాటు కూడా ఓ కారణం.
మంచి ఫుడ్ డైట్‌తో పాటు యోగాను కూడా మిస్ చేయకుండా చేస్తుంది మలైకా.
యోగా అనేది మానసిక వికాసానికి మాత్రమే కాదు శారీరిక ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుంది.
మలైకా ముఖ్యంగా మూడు యోగాసానాలను తన అభిమానులకు సజెస్ట్ చేస్తోంది.
కోర్ కండరాలను బలోపేతం చేయడానికి వసిష్ఠాసనం.
భుజాలు, చేతులను బలంగా చేయడానికి భుజంగాసనం.
బెల్లీ ఫ్యాట్‌ను తొలగించడానికి నౌకాసనం.