కరోనా తరువాత ప్రపంచాన్ని వణికిస్తున్న మంకీ పాక్స్
మొదటి మంకీపాక్స్ కేసు 1970 ఆఫ్రికాలోని రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో 9ఏళ్ల చిన్నారికి సోకింది
ఆఫ్రికా వరకే మంకీపాక్స్ పరిమితమైనా.. 2021 నుంచి ప్రపంచ దేశాలకు పాకింది..
జ్వరం.. కురుపులు.. కాళ్ల నొప్పులు, వెన్ను నొప్పి, స్మాల్ పాక్స్ లక్షణాలు ఈ మంకీపాక్స్ వచ్చిన వారిలో ఉంటాయి
భారత్‌లో మొదటి మంకీ పాక్స్ కేసు.. జులై 15, 2022న కేరళలో నమోదైంది. విదేశీయుల నుంచే ఈ మంకీపాక్స్ కేసులు భారత్‌లోకి ప్రవేశించాయి
శారీరక సంబంధం, స్పర్ష, రక్తమార్పిడి, తుంపర్ల ద్వారా మంకీపాక్స్ వ్యాపిస్తుంది
ఇప్పటివరకు ప్రపంచంలో మొత్తం 17వేలకు పైగా మంకీపాక్స్ కేసులు నమోదయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది
మంకీపాక్స్‌ సోకిన వారు 3 వారాలపాటు ఐసొలేషన్‌లో ఉండాలి
మంకీపాక్స్ వచ్చిన 4 రోజుల్లో స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ ఇస్తే.. కొంత తగ్గే అవకాశం ఉంది
అమెరికాలో మంకీపాక్స్ నివారించడానికి 2 వ్యాక్సిన్లను కనుగ్గొన్నారు
మంకీపాక్స్ సోకితే మరణించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి