సీరియళ్ల నుండి సినిమాలకు వచ్చిన ఆర్టిస్టులలో మృణాల్ ఠాకూర్ ఒకరు.

ముందుగా మరాఠీలో వెండితెరపై హీరోయిన్‌గా పరిచయమయ్యింది మృణాల్.
‘లవ్ సోనియా’ అనే చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.
హృతిక్ రోషన్‌, జాన్ అబ్రహం లాంటి స్టార్ హీరోలతో జోడీకట్టింది.
ఇటీవల షాహిద్ సరసన జెర్సీ రీమేక్‌లో నటించింది.
‘సీతారామం’లో సీతమహాలక్ష్మిగా అందరినీ ఆకట్టుకుంటోంది.
నెట్‌ఫ్లిక్స్ తెరకెక్కించాల్సిన ‘బాహుబలి’ పార్ట్ 3 కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది.
అయితే ఈ మూవీలో శివగామి పాత్ర కోసం మృణాల్ ఆడిషన్ కూడా ఇచ్చిందట.
కానీ పార్ట్ 3 ప్రేక్షకుల ముందుకు రాలేకపోయింది.
సీతారామం మృణాల్‌కు తెలుగులో పర్ఫెక్ట్ డెబ్యూ అనుకుంటున్నారు ప్రేక్షకులు