మెగా ప్రిన్సెస్ నిహారిక పెళ్లి అయిపోవడంతో ఇప్పుడు అందరి దృష్టి వరుణ్ తేజ్ పైనే పడింది.

వరుణ్ తేజ్ పెళ్లి పైన నాగబాబు కూడా పలుమార్లు సోషల్ మీడియాలో కూడా స్పందించారు.
వరుణ్ తేజ్ పెళ్లి విషయంలో తనకెలాంటి అభ్యంతరాలు లేవని ఇప్పటికే కన్ఫర్మ్ చేశారు నాగబాబు.. అంతేకాకుండా అమ్మాయి ఉంటే చూడాలని మెగా అభిమానులను కూడా కోరాడు.
తాజాగా ఇన్‌స్ట్రాగ్రామ్‌ లైవ్‌లోకి వచ్చిన నాగబాబుకి ఓ నెటిజన్.. "వరుణ్ అన్నకి, సాయి పల్లవికి మ్యారేజ్ చేస్తా సార్.. జోడీ బాగుంటుంది' అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
నెటిజన్ కామెంట్ కి షాక్ అయిన నాగబాబు ఏం చెప్పాలో తెలియక.. జాతిరత్నాలు సినిమాలోని క్లైమాక్స్ సన్నివేశంలోని బ్రహ్మానందం ఫోటోను వాడేసుకున్నాడు.
గతంలో వరుణ్ తేజ్, సాయి పల్లవి కలిసి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమాలో కలిసి నటించారు.