భారత సంతతికి చెందిన రిషి సునక్ మే 12, 1980లో సౌతాప్టన్‌లో జన్మించారు
రిషి తండ్రి యశ్వీర్ కెన్యాలో, తల్లి టాన్జేనియాలో జన్మించారు. రిషి తాతగార్లు పంజాబ్ నుంచి ఆఫ్రికాకు 1960లో వలస వెళ్లారు
వెన్చెస్టర్ కాలేజ్, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ఫిలాసఫీ, పాలిటిక్స్, ఎకనామిక్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు
2001 నుంచి 2004 వరకు ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్, గోల్డ్‌మెన్ సాచ్‌లో పనిచేశారు
2009లో అక్షత మూర్తిని బెంగళూరులో పెళ్లి చేసుకున్నారు. వారికిప్పుడు ఇద్దరు కూతుళ్లు.. క‌ృష్ణ, అనౌష్క
ఇన్ఫోసిస్ నారాయణమూర్తికి చెందిన కాటమారన్ వెంచర్స్ కంపెనీకి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు
2015 జనరల్ ఎలక్షన్‌లో రిచ్‌మండ్ యోర్క్‌షైర్‌ నుంచి పార్లమెంటు మెంబర్‌గా ఎన్నికయ్యారు. 2017 మళ్లీ విజయం సాధించారు
2019లో కన్జర్వేటివ్ పార్టీకి చెందిన బోరిస్ జాన్సన్‌కు మద్దతు ప్రకటించారు. మళ్లీ మూడవసారి పార్లమెంటు మెంబర్‌గా ఎన్నికయ్యారు
బోరిస్‌తో కలిసి ఆయన క్యాబినెట్‌లో ఆర్థిక శాఖ బాధ్యతలను చేపట్టారు. కరోనా కాలంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు బ్రిటెన్ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసాయి.
జులై 8, 2022 న బ్రిటన్ ప్రధాని అభ్యర్ధి రేసులో నిలబడబోతున్నట్లు ప్రకటించారు
రిషి సునక్, అక్షత మూర్తి ఆస్తుల విలువ 730 మిలియన్ యూరోలు.. బ్రిటన్ హౌస్ ఆఫ్ కామన్స్‌లో అత్యత ధనిక ఎంపీగా నిలిచాడు