ఊ అంటావా.. ఊహూ అంటావా సాంగ్ సినిమాని నెక్ట్స్ లెవల్‌కి తీస్కెళ్లింది.. అంతే..
స్టార్ హీరోయిన్ సమంత ఆ సాంగ్‌కి డ్యాన్స్ చేయడమే ప్రధాన కారణం..
పుష్స థ్యాంక్స్ మీట్‌లో అల్లు అర్జున్ అదే విషయాన్ని చెప్పాడు..
ఈ పాట చేయడానికి సమంత ఎంత వెనుకాడిందో మాకు తెలుసు
అయినా మేము నిన్ను ఒప్పించాము.. నన్ను నమ్ము అని నేను అన్న ఒక్క మాటకు విలువిచ్చి చేసింది.
అది నా గుండెను తాకింది.. ఏది అడిగినా ఆలోచించకుండా చేసావు.
దాంతో ఆమె మీద నాకు ఇంకా గౌరవం పెరిగింది అన్నాడు బన్నీ. ప్రపంచంలోనే నెంబర్ వన్ సాంగ్‌గా యూట్యూబ్‌లో నిలిచింది ఊ అంటావా పాట.
బన్నీ చేసిన వ్యాఖ్యలకు సమంత రిప్లై ఇస్తూ.. ఇకపై నేను మిమ్మల్ని ఎప్పటికీ నమ్ముతాను అని ట్వీట్ చేసింది.