యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తన సినిమాలతో ఇప్పటికే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు.

ఈ శుక్రవారం ‘సెబాస్టియ‌న్ పీసీ 524’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
బాలాజీ స‌య్యపురెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు.
ఇందులో కిరణ్ అబ్బవరంకు జోడీగా నువేక్ష నటించింది.
రేచీక‌టి ఉన్న కానిస్టేబుల్ క‌థే ‘సెబాస్టియ‌న్ పీసీ 524’.
ఆసక్తికర కథతో తెరకెక్కిన ఈ చిత్రం పాజిటివ్ రెస్పాన్స్‌ను అందుకుంటోంది.
కిరణ్ అబ్బవరం నటన ఈ సినిమాకు పెద్ద ప్లస్.
రేచీక‌టి ఉన్న కానిస్టేబుల్‌గా కాసేపు నవ్వులు పూయించాడు కిరణ్.
ఇప్పటికే ఒకట్రెండు చిత్రాల్లో హీరోయిన్‌గా చేసిన నువేక్ష తన నటనతో ఆకట్టుకుంది.
కోమలీ ప్రసాద్ పాత్ర సినిమాకే ప్రాణంగా నిలిచింది.
మొత్తానికి మార్చి మొదటి వారం సినిమా సందడిని ప్రారంభించిన సెబాస్టియన్ హిట్ కొట్టాడు.