హాకింగ్‌ను చిన్నతనంలోనే ముద్దుగా ఐన్‌స్టీన్ అని పిలిచేవారు.
మోటార్ న్యూరాన్ వ్యాధి కారణంగా హ్యాకింగ్ చాలా ఏళ్లుగా చక్రాల కుర్చీకే పరిమితం అయ్యారు.
ఓ స్పీచ్ జనరేట్ డివైజ్ ద్వారా తాను చెప్పాలనుకున్న విషయాలను వెల్లడించేవారు.
విశ్వంలో నిగూఢ వస్తువుల్లో ఒకటైన కృష్ణబిలాలపై స్టీఫెన్ హాకింగ్ పరిశోధనలు చేశారు.
బిగ్ బ్యాంగ్ థియరీపై స్టీఫెన్ హాకింగ్ చాలా కీలకమైన అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
ఆయన చేసిన పరిశోధనలు ఖగోళ శాస్త్రంలో ఎన్నో ప్రశ్నలకు సమాధానం చూపాయి.
గ్రహాంతర వాసులు ఉన్నారని హాకింగ్ చెప్పడం సంచలనం సృష్టించింది.
స్టీఫెన్ హాకింగ్ తన పేరును ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆఫీస్‌లో రిజిస్టర్ చేసుకున్నారు.
స్టీఫెన్ హాకింగ్ జీవితం ఆధారంగా 'ది థియరీ ఆఫ్ ఎవ్రీతింగ్' సినిమాను తీశారు.