వరుస ఫ్లాపులతో వెనకబడ్డ రవితేజ నుండి అసలు అంచనాలు లేకుండా వచ్చి హిట్ అందుకుంది ‘క్రాక్’.
అనుదీప్ కేవీ లాంటి అప్‌కమింగ్ దర్శకుడు ఈ ఏడాది టాలీవుడ్‌కు ‘జాతిరత్నాలు’ లాంటి బిగ్గెస్ట్ హిట్‌ను అందించాడు.
కొత్త నటీనటులు, కొత్త డైరెక్టర్.. అయినా కూడా ‘ఉప్పెన’ సూపర్ హిట్.
టాలీవుడ్ మాత్రమే కాదు.. ఇంకా ఏ భాషా పరిశ్రమ చూడని కొత్త కథ ‘ఏక్ మినీ కథ’.. అందుకే ఈ కథ మ్యాక్సిమమ్ హిట్.
కమర్షియల్‌గా హిట్ కాకపోయినా.. అందరినీ మెప్పించిన ‘రాజ రాజ చోర’.
డబ్బింగ్ సినిమాల మార్కెట్‌ను మళ్లీ అమాంతం పెంచేసింది ‘వరుణ్ డాక్టర్’.
ఫార్మ్‌లో లేని అల్లరి నరేశ్‌ను మళ్లీ ఫార్మ్‌లోకి తెచ్చింది ‘నాంది’.
కేవలం ఓటీటీలోనే వచ్చి అంతటా ఆదరణ సంపాదించుకున్నాయి ‘మెయిల్’, ‘సినిమాబండి’.
యంగ్ హీరో అయినా కలెక్షన్స్ విషయంలో దూసుకుపోయాడు కిరణ్ అబ్బవరం.. ‘ఎస్‌ఆర్ కళ్యాణమండపం’తో.