స్ట్రాబెర్రీస్, బ్లూ బెర్రీస్ లాంటి వాటితో విటమిన్ సి లభిస్తుంది.
కోడి గుడ్లు పిల్లల శరీరానికి ప్రొటీన్‌ను అందించడానికి తోడ్పడతాయి.
కండరాలు బలంగా ఉండడానికి పిల్లలకు ఆవు పాలను అందించాలి.
షుగర్ లేకుండా పెరుగు తినడం కూడా పిల్లల ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
అవకాడో పండ్లు పిల్లల్లో కొలెస్ట్రాల్ శాతాన్ని కంట్రోల్‌లో ఉంచడానికి ఉపయోగపడతాయి.
ఆకుకూరలు, కూరగాయలు ఎంత ఎక్కువగా తీసుకుంటే పిల్లలకు అంత మంచిది.
పండ్లు.. అందులోనూ ముఖ్యంగా యాపిల్స్‌ను పిల్లలకు రోజుకు ఒక్కటైనా అలవాటు చేయాలి.
ఓట్స్ వల్ల పిల్లల శరీరానికి కావాల్సిన ఫైబర్ అందుతుంది.
అన్ని సీ ఫుడ్స్ పిల్లలకు అంత మంచివి కాకపోవచ్చు.. కానీ ట్యూనా ఫిష్ మాత్రం పిల్లల ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
స్వీట్ పొటాటో వల్ల పిల్లలకు కావాల్సిన న్యూట్రిషన్ అందుతుంది.