చైనాలోని పురాతన సాంప్రదాయ వైద్యం ఆక్యుప్రెజర్.. అయితేనేం మందులతో పనిలేని ఓ అద్భుత ప్రక్రియ ఇది.
సుమారు 100 వ్యాధుల చికిత్స కోసం అత్యంత ప్రభావవంతమైన ఆక్యుపంక్చర్ పాయింట్‌లను ఉపయోగిస్తారు.
తల, ముఖం భాగానికి సంబంధించిన ఇరవై ఎనిమిది వ్యాధులు, మెడ, గొంతుకు సంబంధించి ఆరు వ్యాధులు..
భుజం మరియు వెనుక భాగానికి సంబంధించిన ఆరు వ్యాధులు, స్త్రీలకు సంబంధించిన ఏడు వ్యాధులు,
మానసిక సమస్యలకు సంబంధించిన వ్యాధుల కోసం ఈ ప్రెజర్ పాయింట్ పని చేస్తుంది. ఆరోగ్య సమస్యలను నయం చేసేందుకు ఈ ఆక్యుపంక్చర్ పాయింట్లు ఉత్తమమైనవి.
మన శరీరంలో మొత్తం 365 ప్రెజర్ పాయింట్లు.. అందులో 12 ప్రధానమైనవి ఉంటాయి. పాయింట్లను మసాజ్ చేయడం వలన ప్రతి అవయవం యొక్క పనితీరును ప్రభావితం చేస్తుంది.
మీ కుడి చేతిని కుడి మోకాలిపై, ఎడమ చేతిని ఎడమ మోకాలిపై ఉంచి మోకాలి చిప్ప కింద నొక్కాలి. ప్రతి రోజు ఈ పాయింట్‌పై మసాజ్ చేయడం ద్వారా మీ ఆరోగ్యాన్ని రక్షించే అడ్రినల్ గ్రంథి పని తీరు మెరుగుపడుతుంది.
గ్లూకోజ్ లెవెల్స్‌ని బ్యాలెన్స్ చేస్తుంది.. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.. జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. స్ట్రోక్ వల్ల వచ్చే నష్టాలను నివారిస్తుంది.
రోజుకి మూడు సార్లు ఆ పాయింట్ పై 10 నిమిషాలు ప్రెస్ చేయడం ద్వారా అనేక వ్యాధులనుంచి దూరంగా ఉండొచ్చు.