గుడ్లకు బదులు పుష్కలంగా ప్రోటీన్లు లభించే పీనట్ బటర్‌ను తీసుకోండి. దీనిలో 7 గ్రాముల ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి.
గుడ్లను తినని వారు ప్రత్యామ్నాయంగా క్వినోవా కిచిడీ వంటకాన్ని ప్రయత్నించండి. ఒక కప్పు క్వినోవా కిచిడీలో 8 గ్రాముల ప్రోటీన్లు లభిస్తాయి.
శరీరానికి ఆరోగ్యాన్ని చేకూర్చే డ్రైఫ్రూట్స్‌లో బాదం పప్పుది కీలక పాత్ర. కేవలం పావు కప్పు బాదంలో 7 గ్రాముల ప్రోటీన్లు లభిస్తాయి.
పెరుగులో ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి. ఒక కప్పు పెరుగులో 23 గ్రాముల ప్రోటీన్లు లభిస్తాయి.
సోయాబీన్ లో ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి. ఒక కప్పు సోయాబీన్లో 28 గ్రాముల ప్రోటీన్లు లభిస్తాయి.
గుమ్మడికాయ గింజలు శరీర జీవక్రియను మెరుగుపర్చి జీవక్రియను సులభతరం చేస్తాయి. కుకీస్, జ్యూస్ తయారీలో కేవలం 30 గ్రాముల గుమ్మడికాయ గింజలను వాడితే చాలు 9 గ్రాముల ప్రోటీన్లు లభిస్తాయి.
ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. దీనిలో పోషక పుదార్థాలు పుష్కలంగా లభిస్తాయి. ఒక కప్పు కాటేజ్ చీజ్‌లో 24 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది.