1. వర్షాకాలంలో సైట్ చూసేందుకు వెళ్లడం ఏమిటి కాలు బయటపెట్టడమే కష్టంగా ఉంటే అని వాయిదా వెయ్యరు ఈ విషయాలు తెలిస్తే..
2. వర్షాకాలంలో సైట్ సందర్శనలు, గృహాలు కొనుగోలు చేయడం మంచిది.. ఎందుకంటే ఈ సీజన్‌లో ఇంటి స్థానం మరియు నిర్మాణ నాణ్యత తెలుస్తుంది అంటున్నారు నిపుణులు.
3. వర్షాకాలంలో ప్రాపర్టీ పరిసర ప్రాంతాలు, మిగిలిన సీజన్‌లో కంటే భిన్నంగా ఉండవచ్చు.
4. రియల్ ఎస్టేట్ నిపుణులు గృహాలను కోరుకునేవారు తుది నిర్ణయం తీసుకునే ముందు ఒకటి కంటే ఎక్కువసార్లు నిర్మాణ స్థలాన్ని సందర్శించాలని సలహా ఇస్తారు.
5. వానాకాలంలో సైట్‌ను సందర్శించడం వల్ల నీటి ఎద్దడి పరిస్థితి, అలాగే ఆ ప్రాంతానికి ప్రయాణ సౌకర్యం ఎలా ఉంది తెలుస్తుంది.
6. భవనం యొక్క పరిస్థితిని దాని చుట్టుపక్కల ప్రాంతాలను అంచనా వేయడానికి కొనుగోలుదారులకు రుతుపవనాలు సరైన సమయం.
7. భారీ వర్షం వలన నిర్మాణ లోపాలు, సీపేజ్‌లు/లీకేజీలు, ప్లంబింగ్, డ్రైనేజీ నాణ్యత, వాటర్‌లాగింగ్ మొదలైనవి బహిర్గతం అవుతాయి.
8. వర్షాకాలంలో ప్రాపర్టీలకు డిమాండ్ తగ్గుతుంది కాబట్టి, డిస్కౌంట్‌లకు ఇది అనువైన సమయం. రెయినీ సీజన్‌ని రియల్టీ రంగం ఒక లీన్ పీరియడ్‌గా పరిగణిస్తాయి.
9. ముఖ్యంగా రీసేల్ ప్రాపర్టీలను చూస్తున్న వారికి ఇది మంచి సమయం. కొనుగోలుదారుల కోసం ధరను తగ్గించడానికి సిద్దంగా ఉంటారు ప్రాపర్టీదారులు.