అధో ముఖ శ్వాసాసన.. బోర్లా పడుకుని చేతులను, పాదాలను కిందికి ఆనిస్తూ నడుము భాగాన్ని పైకి లేపాలి. తలని నేలను తాకుతున్నట్లు ఉంచాలి. ఇలా చేయడం వలన తలలోకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది.
ప్రసరిత పాదోత్తానాసన.. నిలబడి కాళ్లు బాగా దూరంగా చాపాలి. ఇప్పుడు ముందుకు వంగి చేతులు కిందకు ఆనించాలి. అలాగే తలను కూడా నెమ్మదిగా కిందకు ఆన్చాలి.
శిశుఆసన.. శశాంకాసనంలో కూర్చోని చేతులను వెనక్కి పెట్టాలి.
జానుశీర్షాసన.. కూర్చోని కాళ్లు దూరంగా జరపాలి. కుడి కాలిని మడిచి ఆ మడమను పెల్విక్ రీజియన్ దగ్గర ఉంచాలి. తలని ఏడమ మోకాలికి తాకించి చేతులతో ఎడమకాలి బొటన వేలు పట్టుకోవాలి.
హస్తపాదాసన.. నిటారుగా నిలబడి నిదానంగా తలను వంచి మోకాళ్ల కింద వరకు తీసుకురావాలి. చేతులతో రెండు అరిపాదాలను పట్టుకోవాలి.
అనులోమ విలోమ.. సుఖాసనంలో కూర్చుని ఎడమ చేతిని చిన్ ముద్రలో ఉంచి, కుడిచేతిని నాసికా ముద్రలో ఉంచాలి. కుడిబొటన వేలితో కుడి ముక్కుని మూసి ఎడమ ముక్కుతో గాలి పీల్చాలి. పీల్చిన గాలిని హోల్డ్ చేసి ఎడమ ముక్కును మూసెయ్యాలి. ఇప్పుడు ఆ గాలిని కుడి ముక్కుతో వదలాలి. అలాగే కుడి ముక్కుతో కూడా చేయాలి. ఇలా ఒక పది సార్లు చేయాలి.