అంతర్జాతీయం

ఆహారం ద్వారా కరోనా వ్యాప్తి .. డబ్ల్యూహెచ్ఓ స్పందన

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది. ఈ మహమ్మారి ఎలా వ్యాప్తి చెందుతుంది అనే దానిపై స్పష్టత

ఆహారం ద్వారా కరోనా వ్యాప్తి .. డబ్ల్యూహెచ్ఓ స్పందన
X

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది. ఈ మహమ్మారి ఎలా వ్యాప్తి చెందుతుంది అనే దానిపై స్పష్టత లేకపోవడంతో ఆందోళనకు గురిచేస్తుంది. దీంతో ప్రజలు ఈ మహమ్మారి భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటున్నారు. ఆహారం ద్వారా కరోనా సోకుతుందని ఇటీవల పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. బ్రెజిల్‌ నుంచి చైనాకు దిగుమతైన కొడి మాంసంలో కరోనా వైరస్ ఆనవాళ్లు గుర్తించామంటూ అక్కడి అధికారలు కొందరు ఇటీవల ప్రకటించారు. అటు, ఈక్వెడార్ నుంచి దిగుమతైన ఆహారం విషయంలో కూడా ఇలాంటి వార్తలు హల్‌చల్ చేశాయి. అయితే, దీనిపై డబ్ల్యూహెచ్ఓ స్పందించింది. ఆహారం ద్వారా కరోనా వ్యాప్తి చెందుతుందనే దానికి ఎక్కడా ఆధారాలు లేవని తెలిపింది. ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.

Next Story

RELATED STORIES