200 మంది రోగులను ఇంజక్షన్లతో చంపిన మేల్ నర్సు

200 మంది రోగులను ఇంజక్షన్లతో చంపిన మేల్ నర్సు

జర్మనీ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. 200 మందికి పైగా రోగులకు అన్‌వాంటడ్ మెడిసన్స్ ఇచ్చి హతమార్చిన ఓ మాజీ మేల్ నర్సుకు జీవిత ఖైదు విధిచింది. డాక్టర్లు రాయని మందులు ఇచ్చి వారిని చావు కారణమయ్యాడు ఆ నర్సు. జర్మనీ దేశానికి చెందిన నియోల్స్ హోజెల్ అనే మేల్ నర్సు డెల్ మెన్ హార్ట్స్, ఒల్డెన్ బర్గ్ నగరాల్లోని పలు ఆసుపత్రుల్లో నర్సుగా పనిచేశాడు.

ఈ సైకో కి్ల్లర్ రోగులకు డాక్టరు రాసిన మందుల స్థానంలో ఇతర ఇంజక్షన్లు చేసి వారిని హత్య చేశాడు. ఈ కిల్లర్ దాదాపు 200 మంది రోగులకు పైగా హతమార్చినట్లు విచారణలో తేలింది. 85 మంది రోగుల హత్యకు సంభందించిన స్పష్టమైన అధారాలు పోలీసులకు లభించాయి. ఈ కేసు విచారించిన న్యాయమూర్తి సెబాస్టియన్ ఇది ఓ 'ఇన్‌కంప్రెహెన్సిల్'( అపారమయినది). 'మానవ కల్పనకు కూడా అందని నేరం'గా పేర్కొన్నారు. అతడు చేసిన హత్యలు ఎన్నో కుటుంబాలలో విషాదం నింపిందన్నారు. దీంతో సీరియల్ కిల్లర్ నియోల్స్ హోజెల్ కు జీవిత ఖైదు విధిస్తూ జడ్జి సంచలన తీర్పు చెప్పారు. అతనికి శిక్ష పడడంతోబాధిత కుటుంబాలు సంతోషం వ్యక్తం చేశాయి.

Tags

Read MoreRead Less
Next Story