బౌండరీల వర్షం కురిపించిన విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌.. సరికొత్త రికార్డు..

తనదైన రోజున ఎవ్వరూ ఆపలేరని మరోసారి నిరూపించాడు భారత ఓపెనర్ రోహిత్‌శర్మ… వన్డేల్లో విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌గా పేరున్న రోహిత్‌ విండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో రెచ్చిపోయాడు. ముంబై బ్రౌబౌర్న్ స్టేడియంలో బౌండరీల వర్షం కురిపించాడు. తన పేరు రోహిత్‌ కాదని రోహిట్‌ అంటూ మరోసారి గుర్తు చేశాడు.

కేవలం 137 బంతుల్లోనే 162 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో 20 ఫోర్లు, 4 సిక్సర్లున్నాయి. 98 బంతుల్లో శతకం సాధించిన రోహిత్‌… తర్వాత మరింత ధాటిగా ఆడాడు. 37 బంతుల్లోనే 62 పరుగులు చేశాడంటే ఏ విధంగా ఆడాడో అర్థం చేసుకోవచ్చు.కెరీర్‌లో రోహిత్‌కు ఇది 21వ వన్డే సెంచరీ. కోహ్లీ తర్వాత అత్యంత వేగంగా ఇన్ని శతకాలు చేసిన భారత క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు.అలాగే వరుసగా తొమ్మిది వన్డే సిరీస్‌లలో సెంచరీలు చేసిన ఆటగాడిగా ఘనత సాధించాడు.

Also Read : భారత్ ఘన విజయం.. సెంచరీలతో రెచ్చిపోయిన రోహిత్‌, రాయుడు

ఈ మ్యాచ్‌లో రోహిత్‌శర్మ డబుల్ సెంచరీ సాధించేలా కనిపించినా… వేగంగా ఆడే క్రమంలో ఔటయ్యాడు. అతను పెవిలియన్‌కు వెళుతున్నప్పుడు స్టేడియం మొత్తం స్టాండింగ్ ఒవేషన్‌తో గౌరవించింది.