Live News Now
 • హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో 11 మంది మహిళలు అరెస్ట్...
 • నకిలి వీసాలతో దుబాయ్ వెళుతున్న 11 మంది మహిళలను అదుపులోకి తీసుకున్నఇమ్మిగ్రేషన్ అధికారులు
 • మెదక్: బోరుబావిలో పడిన బాలుడు రాకేష్ మృతి
 • బోరుబావినుంచి బాలుడిని బయటకు తీసిన అధికారులు..
 • బాలుడు మృతి చెందినట్లు ధృవీకరించిన వైద్యులు
 • నల్గొంఢ: హుజుర్ నగర్ లో పోలీసుల తనిఖీలుు....టాట్ ఏస్ వాహనం సీజ్.. నలుగురు అరెస్ట్
 • విశాఖ: మహారాష్ట్ర ట్రాన్స్ పోర్టు గోదాములో స్వల్ప అగ్నిప్రమాదం..
 • మెదక్: సంగారెడ్డిలో సిపిఎం రాష్ట్ర వస్తృతస్ధాయి సమావేశాలు.. హాజరైన సిపిఎం కార్యదర్శి సీతారాం ఏచూరి
 • హైదరాబాద్: నాగోల్ లోని సూపర్ మార్కెట్ లో మోసం..25 కిలోల బియ్యం బస్తాలో ప్లాస్టిక్ బియ్యం
 • సూపర్ మార్కెట్ ఎదుట బాధితుని ఆందోళన
ScrollLogo ఢిల్లీ:ఐపిఎస్ తీవ్రవాదానికి దక్షిణ భారతం నుంచే యువత ప్రభావితమవుతోంది-కేంద్ర హోంశాఖ సహాయమంత్రి ScrollLogo విశాఖ: వుడా పార్కులో గ్లోబల్ యూత్ మీట్ కార్యక్రమం..హాజరైన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ScrollLogo మెదక్: పుల్కల్(మ)బొమ్మరెడ్డిగూడెంలో ఉద్రిక్తత.. ScrollLogo బోరుబావి యజమాని రాములు ఇంటిమందు రాకేష్ మృతదేహంతో బంధువుల ఆందోళన ScrollLogo హైదరాబాద్: ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, షబ్బీర్ ఆలీలకు అధిష్టానం పిలుపు.. ScrollLogo వరంగల్ ఉపఎన్నిక ఫలితంపై సమీక్షించనున్న అధిష్టానం.. ScrollLogo జిహెచ్ఎంసి,ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్ధులను ఖరారు చేసే అవకాశం ScrollLogo తిరుమల: శ్రీవారి ఆలయానికి ఎలాంటి కల్తీ నెయ్యి సరఫరా కావడంలేదు.. ScrollLogo మహారాష్ట్ర నుంచి గోవింద డెయిరీ ద్వారా నెయ్యి కొనుగోలు చేస్తున్నాం - టిటిడి ScrollLogo తిరుమలకు వచ్చిన నెయ్యి శాంపిల్స్ పరీక్షించాకే శ్రీవారి ప్రసాదాల్లో వినియోగిస్తాం -టిటిడి
tv 5 news: young women selling sex for the price of a sandwich in greece
గ్రీక్ ఆర్థిక సంక్షోభం ఆ దేశానికి తీరని కష్టాలను మిగిల్చింది. చాలా మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయంటే.. కొందరు యువతులు ఆకలి బాధలను తాళలేక ఓ శాండ్ విచ్ కోసం తమ శరీరాన్ని అమ్ముకుంటున్న వైనం వారి దయనీయ పరిస్థితికి అద్దం పడుతోంది. తాజాగా గ్రీక్ లో 17 వేల మందికిపైగా సెక్స్ వర్కర్లు ఉన్నట్టు ఓ సర్వేలో వెల్లడైన నిజం. తూర్పు యూరప్ లో వ్యభిచార వృత్తిలో గ్రీక్ మహిళలే ఎక్కువ మంది ఉన్నారు. గ్రీక్ లో ఆర్థిక సంక్షోభం రాకముందు సెక్స్ వర్కర్లు దాదాపు 4000 వేల వరకు డిమాండ్ చేసేవారు కాగా ఇప్పుడు 150 రూపాయలు ఇస్తే చాలన్నట్టుగా పరిస్థితి మారింది. 17-20 ఏళ్ల వయస్సులో ఈ వృత్తిలోకి వస్తున్నట్టు సర్వేలో తేలిన నిజం.,. tv 5 news: pakistani isi agent arrested at meerut with indian army documents
ఇండియన్ ఆర్మీకి సంబంధించిన కీలక పత్రాలతో పాకిస్థాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐకి చెందిన ఓ ఏజెంట్ పట్టుబడ్డాడు. పాకిస్థాన్‌ జాతీయుడైన మహమ్మద్ ఇజాజ్‌ను యూపీలోని మీరట్‌ కాంట్ ప్రాంతంలో ఆ రాష్ట్ర స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌ (ఎస్టీఎఫ్‌) అరెస్టు చేసింది. ఇస్లామాబాద్‌లోని ఇర్ఫాన్‌బాద్ తారామడి చౌక్‌కు చెందిన అతను మీరట్‌కాంట్‌ నుంచి ఢిల్లీ వెళ్తుండగా అదుపులోకి తీసుకున్నామని ఎస్టీఎఫ్ ఐజీ సుజీత్ పాండే శనివారం విలేకరులకు తెలిపారు.
భారత ఆర్మీకి సంబంధించిన పత్రాలు, పాకిస్థాన్ గుర్తింపు కార్డు, పశ్చిమబెంగాల్‌కు సంబంధించిన నకిలీ ఓటర్ కార్డు, బరెల్లీకి చెందిన నకిలీ ఆధార్ కార్డు, మెట్రో ఐడీ కార్డు, లాప్‌టాప్‌, పెన్‌డ్రైవ్‌లు అతని నుంచి స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. భారత సైన్యం కార్యకలాపాల గురించి తెలుసుకోవడానికి ఓ పాకిస్థానీ పశ్చిమ యూపీకి వచ్చినట్టు నిఘా వర్గాలు సమాచారమిచ్చాయని, ఆ సమాచారం ఆధారంగా ఇజాజ్‌ను అరెస్టు చేశామని తెలిపారు. భారత ఆర్మీ సమాచారాన్ని సేకరించి పంపేందుకు ఐఎస్‌ఐ సూచన మేరకు 2012లో భారత్‌కు వచ్చానని అతను తమ విచారణలో వెల్లడించడాని ఐజీ పాండే వెల్లడించారు. 
టాలీవుడ్
 • tv 5 news: bhale manchi roju wall poster
 • tv 5 news: ika say love movie wall poster
 • tv 5 news: ramasakkani rakumarudu wall poster
 • tv 5 news: jatakalisey first look wall poster
 • tv 5news: kalyana vaibhogame selfie wall poster
సినీ గాసిప్స్
tv 5 news: allu arjun and jr ntr cameo in devi sri prasad and sukumar movie
దేవి సినిమాతో సంగీత దర్శకుడిగా కెరీర్ మొదలు పెట్టి.. దక్షిణ చలన చిత్ర పరిశ్రమలో మంచి ఫాం ఉన్న సంగీత దర్శకుడు. అంతే కాదు మల్టీటాలెంటెడ్ పర్సన్ కూడా. కాగా దేవిశ్రీప్రసాద్ ఎప్పటి నుండో హీరోకావాలని కలలు కంటున్నాడు. ఆ కలతీరే రోజు ఇప్పుడు వచ్చింది. సుకుమార్ దర్శకత్వంలో దేవి శ్రీ ప్రసాద్ హీరోగా దిల్ రాజు నిర్మాణ సారధ్యంలో ఓ సినిమా తెరకెక్కునున్నదనే విషయం విధితమే. ఇప్పటికే సంగీత దర్శకుడిగా మంచి ఆదరణ సొంతం చేసుకున్న దేవీ కి ఇండస్ట్రీ సపోర్ట్ బాగా ఉంది. సుకుమార్, దేవిలపై ఉన్న అభిమానంతో ఈ సినిమాలో క్యామియో అప్పీయరెన్స్ ఇస్తామంటూ ఎన్టీఆర్, అల్లు అర్జున్ లు మాటిచ్చారట. అంతేకాక తమ సినిమాలు సక్సెస్ అయ్యేందుకు సంగీతంతో తమకు సక్సెస్ అందించిన దేవి హీరోగా సక్సెస్ అయ్యేందుకు తాము కూడా సపోర్ట్ చేస్తామని కొంత మంది హీరోలు ఫోన్ చేసి మరీ చెబుతున్నారట. దీంతో ఈ సినిమాకి అనౌన్స్ మెంట్ తోనే పిచ్చ క్రేజ్ సంపాదించుకున్నది. 


tv 5 news: akhil's second movie director confirmed?
అఖిల్ అక్కినేని హీరోగా తెరంగ్రేటం చేసిన చిత్రం అఖిల్. ఈ సినిమా దీపావళి కానుకగా విడుదలై అతి పెద్ద డిజాస్టర్ గా మిగిలింది. కానీ అఖిల్ స్క్రీన్ పై తన డాన్స్ తో, ఫైట్ తో ప్రెజెన్స్ తో అకట్టుకున్నాడు. అఖిల్ నెక్స్ట్ సినిమాపై చాలా రూమర్స్ వినిపించాయి. కాగా ఇప్పుడు నాగార్జున, అఖిల్ లు నెక్స్ట్ సినిమాకోసం స్క్రిప్ట్ వినే పనిలో ఉన్నారట. ఈ సినిమాకి ఒకపైపు, శ్రీను వైట్ల అని, మరో వైపు క్రిష్ అని వార్తలు వినిపించాయి. తాజాగా అఖిల్ నెక్స్ట్ సినిమా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకి దానయ్య నిర్మాతగా... త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందింపబడుతున్నదట. నితిన్ హీరోగా త్రివిక్రమ్ 'అ..ఆ' చిత్రం షూటింగ్ పూర్తి అయ్యాక ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నదట. 


ఏపీలో టెన్త్ , ఇంటర్ పరీక్షల షెడ్యూల్ రిలీజైంది. మార్చి 21 నుంచి ఏప్రిల్ 7వరకు పదో తరగతి పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పదో తరగతి పరీక్షలు జరుగుతాయని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. మార్చి 2 నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సరం, మార్చి 3 నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జంబ్లింగ్ పద్ధతిలోనే ఇంటర్ ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టంచేశారు. ఫిబ్రవరి 4 నుంచి 24 వరకు ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కేశవరెడ్డి పాఠశాల వ్యవహారంపై కుటుంబరావు నేతృత్వంలో కమిటీ నియమించినట్లు తెలిపారు.

inter exams schedule released by telangana govt
ఇంటర్మీడియేట్ పరీక్షల షెడ్యూల్ ను తెలంగాణ ప్రభుత్వం ప్రాథమికంగా విడుదల చేసింది. మార్చి రెండో తేదీ నుంచి 21వ తేదీ వరకు ఇంటర్ వార్షిక పరీక్షలను నిర్వహించడానికి తెలంగాణ ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఫిబ్రవరి మూడో తేదీ నుంచి 24వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు ఉంటాయని తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్ మూడో తేదీన జేఈఈ మెయిన్స్ పరీక్ష జరగనుంది. ఆ లోపు ఇంటర్ పరీక్షలను పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం సిద్ధం అయింది. మెయిన్స్ పరీక్షకు వెయిటేజి మార్కులను లెక్కించాల్సి ఉంటుంది. దీంతో ఇంటర్ పరీక్షలను వీలున్నంత త్వరగా నిర్వహించడంతో పాటు ఫలితాలను త్వరితగతిన విడుదల చేయడానికి ఇంటర్ బోర్డ్ రంగం సిద్ధం చేసింది. సో.. ఈ ఏడాది మార్చి రెండో తేదీ నుంచి పరీక్షలను నిర్వహించడానికి షెడ్యూల్ ను సోమవారం విడుదల చేశారు. 

medplus offer
NRI Edition
AP News
Telangana News
Super Movie
Sports
Daily Specials