Ram Charan Watch : హీరో రామ్‌చరణ్ పెట్టుకున్న ఈ వాచ్ ధరెంతో తెలుసా?

Ram Charan Watch : హీరో రామ్‌చరణ్ పెట్టుకున్న ఈ వాచ్ ధరెంతో తెలుసా?
Ram Charan Watch : సెలబ్రిటీలు ఏం ధరించిన అవి చాలా కాస్ట్‌లీగానే ఉంటాయి. దీనితో వాటి ధరెంతో తెలుసుకునేందుకు అభిమానులు తెగ ఆరాటపడుతుంటారు.

Ram Charan Watch : సెలబ్రిటీలు ఏం ధరించిన అవి చాలా కాస్ట్‌లీగానే ఉంటాయి. దీనితో వాటి ధరెంతో తెలుసుకునేందుకు అభిమానులు తెగ ఆరాటపడుతుంటారు. తాజాగా రామ్ చరణ్ తేజ్ ధరించిన వాచీపైనే ఇప్పుడు సోషల్‌ మీడియాలో చర్చ నడుస్తుంది. రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబోలో ఓ సినిమా తెరక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూజ కార్యక్రమాలు నిన్న హైదరాబాదులో జరిగాయి. అయితే ఈ వేడుకలో రామ్ చరణ్ ధరించిన వాచ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. దీనితో వాచ్ మోడల్ ఏంటి దాని ధర ఎంతని అభిమానులు ఇంటర్నెట్ లో సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. అయితే అది 'రిచర్డ్ మిల్లె RM 61-01 యోహన్ బ్లేక్ మోడల్‌' అని తెలిసింది. ఒలంపిక్స్‌లో 100,200 మీటర్లలో ఫాస్టెస్ట్ రన్నర్‌గా ప్రపంచ రికార్డ్‌ సాధించిన యోహన్ బ్లేక్ కోసం 'రిచర్డ్ మిల్లే' కంపెనీవారు ఈ వాచ్‌ని స్పెషల్‌గా డిజైన్ చేశారు. బ్లాక్ కలర్ రబ్బర్ స్ట్రిప్ తో పాటు యల్లో, గ్రీన్ కాంబోతో డైల్ కలర్స్ ఉండడం ఈ వాచ్ ప్రత్యేకత.. కాగా ఈ వాచ్ ధర.. 124500 యూరోలు. అంటే ఇండియన్‌ కరెన్సీలో అక్షరాలా రూ.1,02 కోట్లు అన్నమాట.

Tags

Read MoreRead Less
Next Story