పోస్టాఫీస్‌లో డ్రైవర్ ఉద్యోగాలు.. జీతం రూ. 19,900

ఇండియా పోస్ట్ స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టుల నియామకాన్ని చేపట్టింది. నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్ , పెద్దపల్లి, మహబూబ్‌నగర్ డివిజన్లలో స్టాఫ్ కార్ డ్రైవర్లను నియమించనుంది. ఇందుకోసం ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. మొత్తం 6 పోస్టులు ఉన్నాయి. వాటిలో ఓబీసీలకు 2, ఎస్టీలకు 1 పోస్టును రిజర్వ్ చేశారు. ఎంపికైన వారికి వేతనం రూ.19,900 ఇస్తారు. రెండేళ్లు ప్రొబేషన్ పీరియడ్ వుంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్ట్ 14 చివరి తేదీ. 18 నుంచి 27 ఏళ్ల లోపు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలి. ఓబీసీ, ఎస్టీలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.
లైట్, హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. డ్రైవింగ్‌లో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి. దాంతో పాటు మోటార్ మెకానిజం తెలిసి ఉండాలి. దరఖాస్తుల షార్ట్ లిస్టింగ్ తర్వాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. డ్రైవింగ్ టెస్ట్ కూడా ఉంటుంది. పరీక్ష తేదీ, స్థలం లాంటి వివరాలను ఇండియా పోస్ట్ త్వరలో వెల్లడిస్తుంది. ఏజ్ ఫ్రూఫ్, విద్యార్హతల సర్టిఫికెట్, డ్రైవింగ్ ఎక్స్‌పీరియెన్స్ సర్టిఫికెట్, ఓబీసీ, ఎస్టీలకు క్యాస్ట్ సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్స్ లాంటి డాక్యుమెంట్స్‌తో పాటు ఓ పాస్‌పోర్ట్ ఫోటో దరఖాస్తుకు జత చేయాలి. ఆగస్ట్ 14 సాయింత్రం 5.30 గంటల తర్వాత వచ్చిన దరఖాస్తుల్ని అనుమతించరు. దరఖాస్తుల్నిపంపాల్సిన అడ్రస్.. The Manager Mail Motor Service Koti, Hyderabad-500095.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com