యూపీఏ మీద విసుగుతోనే ప్రజలు బీజేపీని గెలిపించారు: కేసీఆర్

యూపీఏ మీద విసుగుతోనే ప్రజలు బీజేపీని గెలిపించారు: కేసీఆర్

ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని నమ్ముకుంటే.. శంకరగిరి మాన్యాలే అని సీఎం కేసీఆర్‌ అన్నారు. శాసనసభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా.. బీజేపీ నాయకులపై విరుచుకుపడ్డారు. బీజేపీ వాళ్లకు లేకలేక అధికారం వచ్చిందన్నారు. యూపీఏ పాలనపై విసుగుతోనే దేశ ప్రజలకు ఓటు వేశారన్నారు. టీఆర్‌ఎస్‌పార్టీకి అవకాశం లేకలేక రాలేదు.. రాష్ట్రాన్ని సాధించుకుని మొదటిసారి పోటీచేసి అధికారంలోకి వచ్చామన్నారు కేసీఆర్. లేకలేక వచ్చిన అవకాశాన్ని.. బీజేపీ తీవ్రంగా దుర్వినియోగం చేస్తోందన్నారు. దేశానికి అన్నం పెట్టే రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు కేసీఆర్‌.

Tags

Read MoreRead Less
Next Story