కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై అభిషేక్ ట్వీట్

బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఫ్యామిలిలో నలుగురు కరోనా భారిన పడిన సంగత్ తెలిసిందే. శనివారం అమితాబ్ ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ లకు కరోనా నిర్ధారణ కాగా.. ఆదివారం ఐశ్వర్యరాయి ఆమె కుమార్తెకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ తరుణంలో కుటుంబసభ్యుల ఆరోగ్య స్థితి అలాగే హాని డిశ్చార్జ్ అయ్యాడనే రూమర్లపై అభిషేక్ బచ్చన్ ట్వీట్ చేశారు.. వైద్యులు నిర్ణయం తీసుకునేవరకు నేను, నా తండ్రి ఆస్పత్రిలోనే ఉంటాం.. ప్రతి ఒక్కరూ దయచేసి జాగ్రత్తగా
మరియు సురక్షితంగా ఉండండి. దయచేసి అన్ని నియమాలను పాటించండి! ఇక ఐశ్వర్య మరియు ఆరాధ్యకు కూడా COVID-19 పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వారు ఇంట్లో స్వీయ నిర్బంధంగా ఉంటారు. BMC వారి పరిస్థితిని సమీక్షిస్తోంది. అలాగే వారికి అవసరమైన వాటిని సమకూర్చుతోంది. నా తల్లితో సహా మిగిలిన కుటుంబసబ్యులకు కరోనా నెగటివ్ వచ్చింది. మాకోసం మీరు చేసే ప్రార్థనలకు ధన్యవాదాలు. అంటూ ట్వీట్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com