నిరాడంబరంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. కేంద్రం మార్గదర్శకాలు

నిరాడంబరంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. కేంద్రం మార్గదర్శకాలు
X

ఆగస్టు 15న జరుపుకోనున్న స్వాతంత్ర్య వేడుకల నిర్వాహణపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది స్వతంత్ర్య దినోత్సవ వేడుకలు నిరాడంబరంగా జరుపుకోవాలని ఆదేశించారు. ఎక్కువ మంది ఒకే చోట ఉండి జరుకోవద్దని అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తికి ఏమాత్రం అవకాశం ఇవ్వద్దని తెలిపారు. వీలైనంతగా సాంకేతిక పరిజ్ఞానం వాడుకోని కరోనా వ్యాప్తిని తగ్గించుకోవాలని సూచించారు. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు, గవర్నర్లు, అన్ని శాఖల అధికారులకు లేఖలు రాసింది. ప్రతీ ఏటా ఘనంగా జరిగే స్వతంత్ర్య దినోత్సవ వేడుకలు కరోనా నేపథ్యంలో నిరాడంబరంగా జరిపించాలని కేంద్ర పేర్కోంది.

Tags

Next Story