viral video: ఛీఛీ.. కొంచెం కూడా బుద్ది లేదు.. బండి మీద రొమాన్సా..
viral video: అదేం ఆనందమో.. అందరూ చూడాలని ఎందుకనుకుంటారో.. పర్సనల్ విషయాన్ని పబ్లిక్ చేసేస్తున్నారు. బెడ్ రూమ్ ని బజార్లోకి తెస్తున్నారు.. దాన్ని కూడా వైరల్ చేస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు.
చుట్టూ చూస్తున్నారన్న భావన కొంచెమైనా లేకుండా ప్రవర్తిస్తున్నారు. అజ్మీర్ కు చెందిన ఓ జంట మోటార్ సైకిల్ పై తిరుగుతూ ముద్దులు, కౌగిలింతలలో మునిగిపోయారు. ఇక ఇలాంటి వాటిని వీడియో తీసి వైరల్ చేయడానికి కాచుకుని ఉంటారు కొందరు వ్యక్తులు.. దాంతో శుభ్రంగా ఈ జంట సోషల్ మీడియా వేదికనెక్కింది.
వీడియో వైరల్ అయిన వెంటనే, అజ్మీర్‌లోని క్రిస్టియన్ గంజ్ పోలీస్ స్టేషన్ రైడర్‌పై IPC సెక్షన్లు 336- (ప్రాణానికి హాని), 279- (నిర్లక్ష్య చర్య) మరియు 294- (బహిరంగ ప్రదేశంలో) అసభ్యకర చర్యకు పాల్పడటం) కింద కేసు నమోదు చేసింది. పోలీసులు బైక్‌ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు నివేదికలు అందాయి.
బైక్ రైడర్‌ను ఫే సాగర్ రోడ్డులో నివాసం ఉంటున్న సాహిల్‌గా గుర్తించారు.
గత నెల ప్రారంభంలో, లక్నోలోని ఒక జంట నవాబ్స్ నగరంలోని రోడ్డుపై రొమాన్స్ చేస్తూ చుట్టు పక్కల వారిని పట్టించుకోవడం మానేశారు. వైరల్ క్లిప్‌లో, జంట కారు సన్‌రూఫ్‌పై రొమాన్స్ చేస్తున్నారు. స్థానికుల సమాచారంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని చీవాట్లు తగిలించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com