న్యూ ఇయర్‌ జోష్‌.. హైదరాబాద్‌లో డ్రగ్‌ సరఫరా

న్యూ ఇయర్‌ జోష్‌.. హైదరాబాద్‌లో డ్రగ్‌ సరఫరా

drug

న్యూఇయర్‌ సందర్భంగా.. హైదరాబాద్ యువతను మత్తులో దించేందుకు రెడీ అవుతోన్న డ్రగ్‌ మాఫియా గుట్టు రట్టు చేశారు హైదరాబాద్‌ వెస్ట్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు. ఈ సారి డ్రగ్‌ మాఫియా.. ఏకంగా ఈవెంట్‌ ఆర్గనైజర్లతో డ్రగ్‌ సరఫరాకు ప్లాన్‌ చేసింది. పక్కా సమాచారంతో.. రంగంలో దిగిన పోలీసులు.. షేక్‌ షాబాజ్‌ అనే ఈవెంట్‌ మేనేజర్‌ను అరెస్ట్‌ చేశారు. అతని‌ నుంచి.. 6 గ్రాముల కొకైన్‌, 4 గ్రాముల ఎండీఎంఏ మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు కోసం గాలిస్తున్నారు పోలీసులు.

ముంబైకి చెందిన షేక్‌ షాబాజ్‌‌.. రాజేంద్రనగర్‌, ఉప్పర్‌పల్లిలో ఉంటున్నాడు. ఇతను ఈవెంట్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. గత కొంతకాలంగా షాబాజ్‌.. ఇతర రాష్ట్రాల నుంచి డ్రగ్స్‌ కొనుగోలు చేసి హైదరాబాద్‌లో విక్రయిస్తున్నాడు. ఇతనిపై నిఘా పెట్టిన పోలీసులు పక్కా సమాచారంతో అతన్ని అదుపులో తీసుకున్నారు. మరో నిందితుడు తప్పించుకుపోవడంతో.. అతని కోసం గాలిస్తున్నారు.

కొత్త సంవత్సం సందర్భంగా.. ఇప్పటికే హైదరాబాద్‌లో పెద్దఎత్తు డ్రగ్స్‌ దిగుమతి జరిగినట్లు పోలీసులు గుర్తించారు. నిన్నమొన్నటి వరకు పబ్‌లకే పరిమితమైన డ్రగ్స్‌ విక్రయాలు.. ఇప్పుడు నగర శివారుకూ పాకాయి. గతంలో విదేశీయులే హైదరాబాద్‌లో డ్రగ్స్‌ సరఫరా చేస్తుండగా ఇప్పుడు స్థానికులే డ్రగ్స్‌ వ్యాపారులుగా అవతారం ఎత్తుతున్నారు. పోలీసులు నిఘా లేని శివారు ప్రాంతాలను ఎంచుకుని.. మాదకద్రవ్యాలను సరఫరా చేస్తోంది డ్రగ్స్‌ మాఫియా. దీంతో కోట్ల రూపాయల డ్రగ్స్‌ నగరానికి, శివారు ప్రాంతానికి తరలుతున్నాయి.

డ్రగ్స్‌ సరఫరాకు సంబంధించి గత ఏడాది 55 కేసులు నమోదు కాగా.. ఈ సారి ఏకంగా 88 కేసులు నమోదయ్యాయి. ఇక.. గతంలో విదేశీయులే అరెస్ట్‌ కాగా.. ఇప్పుడు అరెస్టైన వారంతా.. స్థానికులే కావడం విశేషం. డ్రగ్స్‌ సరఫరా చేసేందుకు ఈజీగా సబ్‌ఏజెంట్లు, బ్రోకర్లు దొరకడంతో.. డ్రగ్స్‌ మాఫియా.. తమ దృష్టిని హైదరాబాద్‌ మీద పెట్టింది. పబ్‌లు, మద్యం షాపులు, మసాజ్‌ సెంటర్లతో పాటు ఇప్పుడు ఈవెంట్‌ ఆర్గనైజర్లతోనూ డ్రగ్స్‌ సరఫరా చేస్తూ యువతను మత్తులో దించి కోట్లు సంపాదిస్తోంది డ్రగ్స్‌ మాఫియా. హైరాయిన్‌, కొకైన్‌, చరస్‌ లాంటి మాదకద్రవ్యాలు.. విదేశాలనుంచి గోవా ద్వారా హైదరాబాద్‌కు చేరుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story