గేమ్ నుండి తనీష్ క్విట్.. బిగ్ బాస్‌ హిస్టరీలో ఇదే ఫస్ట్ టైం

tanish, nani

బుల్లితెరపై హంగామా స‌ృష్టిస్తున్న బిగ్ బాస్ సీజన్ 2 చివరి దశకు చేరుకుంది. ఈ సీజన్‌లో ఇంకా 17 ఎపిసోడ్స్ మాత్రమే మిగిలి ఉండటంతో టైటిల్ విన్నర్ ఎవరనే దానిపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. ఇక హౌస్‌లో కెప్టెన్ విషయంలో పోటాపోటీ హోరు సాగుతోంది. హౌస్ లో కెప్టెన్ అవ్వడం కోసం ‘అలిసిపోతే అంత‌మే’ అనే సైకిల్ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. త‌నీష్‌, రోల్ రైడా, నూత‌న్ నాయుడు ఈ గేమ్‌లో పాల్గొన్నారు.

టాస్క్‌లో భాగంగా సైకిల్ తొక్కుతున్న క్ర‌మంలో నూత‌న్ నాయుడు సైకిల్ చైన్‌ స్ట్ర‌క్ అయింది. బిగ్ బాస్ చైన్ స‌రిచేయోచ్చ‌ని చెప్ప‌డంతో కౌశ‌ల్ సైకిల్ చైన్ స‌రిచేశారు. కాని సైకిల్ చైన్ ప‌దే ప‌దే స్ట్ర‌క్ అవ్వ‌డంతో నూత‌న్ నాయుడుకు రిలాక్స్ దొరికింది. ఇది న‌చ్చ‌ని త‌నీష్ సైకిల్ దిగి గేమ్ నుండి క్విట్ అయ్యాడు.

కావాలనే నూతన నాయుడికి ఇలాంటి సైకిల్ ఇచ్చి బిగ్‌బాస్ డ్రామాలు ఆడుతున్నారని సామ్రాట్ వద్ద తనీష్ వాపోయాడు. డైరెక్ట్‌గా నూతన నాయుడిని కెప్టెన్ చేస్తే సరిపోతుంది కదా.. మా ఎనర్జీతో బిగ్‌బాస్ ఆడుకోవడం ఎందుకంటూ ఎమోషన్ అయ్యాడు తనీష్. ఇక సైకిల్ టాస్క్ ఎండ్ బ‌జ‌ర్ మోగే సమయానికి నూత‌న్ నాయుడు, రోల్‌ రైడా ఇద్ద‌రూ సైకిల్‌పై ఉన్నారు. దీంతో ఈ వారం బిగ్ బాస్ హౌస్‌కి ఎవ‌రు కెప్టెన్‌గా ఉండ‌రంటూ బిగ్ బాస్ పేర్కొన్నాడు. ఇలా ఓ వారం రోజులు హౌస్‌కి కెప్టెన్ లేక‌పోవ‌డం బిగ్ బాస్ హిస్ట‌రీలో ఇదే ఫస్ట్ టైమ్.