మహిళ స్నానం చేస్తుండగా ఫొటోలు.. సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యాయత్నం..

ఓ నీచుడి వేధింపులు మహిళ ప్రాణాల మీదికి తెచ్చాయి. న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగింది. కానీ ఆమె గోడును పట్టించుకున్నవారే లేరు. ఖాకీల తీరుపై ఆగ్రహించింది. ఏకంగా పోలీస్ స్టేషన్‌ ముందే ఆత్మహత్యాయత్నం చేసింది.

అందరూ చూస్తుండగానే పోలీస్ స్టేషన్‌ ముందు ఆత్మహత్యా యత్నం చేసింది సబిత. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. దీంతో ఒక్కసారిగా మంటలు ఆమెను చుట్టుముట్టాయి.

woman, suicide

రోడ్డుపై వెళ్లేవాళ్లు… పోలీసులు కలిసి ఎలాగోలా మంటలను ఆర్పేశారు. కానీ అప్పటికే ఆమె శరీరం 70 శాతం వరకు కాలిపోయింది. ఈ ఘటన సికింద్రాబాద్ బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్ ఎదుట జరిగింది. సబితది బేగంపేటలోని అన్నానగర్‌. బాత్రూంలో స్నానం చేస్తుండగా వెంకటేష్ గౌడ్ అనే పోకిరి తన ఫొటోలు తీశాడని, వాటిని అడ్డం పెట్టుకుని వేధిస్తున్నాడని బేగంపేట్ మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. వాళ్లు పట్టించుకోకపోవడంతో బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో కూడా వెంకటేష్‌గౌడ్‌పై ఫిర్యాదు చేసింది. కానీ వాళ్లు కూడా పట్టించుకోకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందింది.

సూసైడ్ నోట్ రాసుకుని, కిరోసిన్ తీసుకుని బోయిన్‌పల్లి పీఎస్‌కు చేరింది. స్టేషన్‌కు ఎదురుగా రోడ్డుపక్కనే ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుంది. మంటలు ఆర్పడానికి పోలీసులు, స్థానికులు ప్రయత్నించారు. కానీ అప్పటికే తీవ్ర గాయాలపాలైన ఆమెను వెంటనే గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. ఆమె ఆత్మహత్యాయత్నానికి కుటుంబ కలహాలే కారణం అంటున్నారు పోలీసులు.

70 శాతం కాలిన గాయాలతో ప్రస్తుతం సబిత చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. మరో 48 గంటలు గడిస్తేగానీ ఏమీ చెప్పలేమని వైద్యు అంటున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సబిత వాంగ్మూలాన్ని న్యాయమూర్తి రికార్డు చేశారు. వెంకటేష్ గౌడ్ చేసిన వెదవ పనికితోడు పోలీసుల నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని ప్రమాదంలోకి నెట్టింది. పోలీసులు వెంటనే యాక్షన్ తీసుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని స్థానికులు ఖాకీల తీరుపై మండిపడుతున్నారు.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -